బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 15:36:57

నేను సీరియళ్లలో నటించట్లేదు: బ్రహ్మానందం

నేను సీరియళ్లలో నటించట్లేదు: బ్రహ్మానందం

సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్  కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తీరిక లేకుండా సినిమాలతో బిజీబిజీగా ఉండే బ్రహ్మానందం వయస్సు పై బడుతున్న నేపథ్యంలో సినిమాలను తగ్గించుకున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన బహ్ర్మీ తన రూటు టీవీ వైపు మళ్లించినట్లు కొన్ని రోజులుగా  వార్తలు వస్తున్నాయి.  పుకార్లకు చెక్ పెడుతూ తన స్పందనను తెలియజేశారు బ్రహ్మీ.

నేను ప్రస్తుతం ఎలాంటి సీరియళ్లు చేయడం లేదు. గత మూడున్నర నెలల నుంచి నా ఇంట్లో నుంచి బయటకు వస్తలేను. మరికొంత కాలం కూడా నేను మా ఇంట్లోనే ఉంటానని, బయటకు రానని చెప్పారు. ప్రస్తుతం నా ఇంట్లో సురక్షితంగా, క్షేమంగా ఉన్నాను. నా మనవడితో కలిసి ఆడుకుంటున్నా. సమయం అలా గడిచిపోతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నా కెరీర్ గురించి ఆలోచించడం లేదు. టైం దొరకడంతో చాలా పుస్తకాలు చదువుతున్నా. డ్రాయింగ్ వేయడం నాకు చాలా ఇష్టం. నేను ప్రశాంత జీవనం గడుపుతున్నా. ఇలాంటి పుకార్లు ఎక్కడ నుంచి మొదలయ్యాయో తెలియక ఆశ్చర్యమేస్తుందంటూ చెప్పుకొచ్చారు. logo