ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 19:42:35

నా అహంకారం తగ్గించుకోవాల్సి వచ్చింది: ప్రియాంకచోప్రా

నా అహంకారం తగ్గించుకోవాల్సి వచ్చింది: ప్రియాంకచోప్రా

అమెరికాలో నాకు అవకాశం వచ్చిన తర్వాత అక్కడికెళ్లి రిప్రంజేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడు నా అహంకారాన్ని తగ్గించుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాజోనస్ చెప్పుకొచ్చింది. నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా అమెరికాకు తన మకాం మార్చిన సంగతి తెలిసిందే. యూఎస్ లో సినిమా కెరీర్ కోసం ప్రయత్నాలు చేయాలనుకున్నపుడు అహంకారాన్ని పక్కన పెట్టినట్టు తెలిపింది. 

నేను ఎవరిని..ఏం చేయాలనుకుంటున్నానని ఇక్కడ వివరించుకోవాల్సి వచ్చింది. అమెరికన్ సినిమాల్లో అద్భుతంగా పనిచేసిన కొంతమంది భారత నటీనటులు..ఇర్ఫాన్ ఖాన్ , టబు, అనుపమ్ ఖేర్, అమితాబ్ బచ్చన్ లాంటివారున్నారు. మిండీ కలింగ్, అజీజ్ అన్సారీ ఇండో అమెరికన్లు కాని నటులున్నారు. అమెరికా సంస్కృతికి సంబంధంలేని, భారత్ నుంచి వలస వచ్చిన వ్యక్తి గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ ను బ్రేక్ చేసినట్లు చెప్పుకోవడానికి ఎలాంటి ఉదాహరణ లేదని ప్రియాంక చెప్పుకొచ్చింది. 


logo