కేవలం 24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్వైఎస్ఈ) 1792 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. హోటల్ గది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా వెలుగొందుతున్నది. ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్లో 2 వేలకు పైగా కంపెనీలు నమోదయ్యాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. ప్రతిరోజూ 9 మిలియన్లకు పైగా స్టాక్స్, సెక్యూరిటీలు వ్యాపారం జరుగుతాయి. అందుకే ఎన్వైఎస్ఈని ‘ది బిగ్ బోర్డ్’ అని కూడా పిలుస్తారు.
దీన్ని ప్రారంభించిన వారందరూ న్యూయార్క్‌లో బాండ్లు, సెక్యూరిటీల వ్యాపారం చేసేవారు. వీరంతా న్యూయార్క్‌లోని ఒక హోటల్ గదిలో కలుసుకుని తమతమ వ్యాపారాలను మరింత సురక్షితంగా, మెరుగ్గా జరుపుకోవాలనే దానిపై చర్చించారు. ఆ చర్చల నుంచే ఎన్వైఎస్ఈ పురుడుపోసుకున్నది.
ఈ 24 మంది వ్యాపారులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. దీనికి బటన్వుడ్ ఒప్పందం అని పేరు పెట్టారు. ఈ ఒప్పందంలో సెక్యూరిటీల వ్యాపారానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఒప్పందం ఒక తోటలోని బటన్వుడ్ చెట్టు కింద సంతకం చేయబడింది, అందుకే దీనికి బటన్వుడ్ ఒప్పందం అని పేరు పెట్టారు.
తొలుత 2 బ్యాంక్ బాండ్లు, 3 ప్రభుత్వ బాండ్లతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 1967 లో మురల్ సీబర్ట్ అనే మహిళ ఈ స్టాక్ ఎంక్స్చేంజ్లో వ్యాపారం చేసి వినుతికెక్కారు. 2007 లో ఎన్వైఎస్ఈ, యూరప్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘యూరోనెక్స్ట్’ విలీనమయ్యాయి. మరుసటి సంవత్సరం యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను కూడా సొంతం చేసుకుంది.
నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ అవగాహనా దినోత్సవం
2010: కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 6 బంగారు పతకాలతో జట్టు ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న భారత బాక్సర్లు
2004: స్వలింగ వివాహం గుర్తించిన అమెరికాలోని తొలిరాష్ట్రంగా అవతరించిన మసాచుసెట్స్
1978 : హాస్యనటుడు చార్లీ చాప్లిన్ శవపేటికను కనుగొన్న పోలీసులు
1975: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జపనీస్ మహిళ జుంకో తైబీ
1939 : తొలిసారిగా క్రీడల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం
1918: భారతదేశపు ప్రసిద్ధ పారిశ్రామికవేత్త రష్యన్ మోడీ జననం
1865: ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం ప్రారంభం
1749: ‘మశూచి’ వ్యాక్సిన్‌ను కనుగొన్న ఎడ్వర్డ్ జెన్నర్ జననం
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..