శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 19:36:59

ఔటింగ్ వెళ్లిన‌ట్ట‌నిపిస్తుంది..ఇన్ స్టా పోస్టులో మ‌లైకా

ఔటింగ్ వెళ్లిన‌ట్ట‌నిపిస్తుంది..ఇన్ స్టా పోస్టులో మ‌లైకా

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇపుడు క‌రోనాను జ‌యించి త‌న ఫాలోవ‌ర్ల‌కు సందేశాన్నిచ్చింది మ‌లైకా. నేను మొత్తం మీద చాలా రోజుల త‌ర్వాత‌ నా గ‌ది నుంచి బ‌య‌ట‌కొచ్చా. నేను ఔటింగ్ కు వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. త‌క్కువ నొప్పి, త‌క్కువ అసంతృప్తితో క‌రోనాను అధిగ‌మించ‌డం ఆనందంగా ఉంది. నాకు స‌హ‌క‌రించిన బీఎంసీ అధికారులు, వైద్య‌స‌లహాలు, సూచ‌న‌లు అందించిన డాక్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు. నేను ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుని..నాకు 

మ‌ద్ద‌తుగా నిలిచిన కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నాకు అండ‌గా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రి కృషి మాట‌ల్లో చెప్ప‌లేను. ద‌య‌చేసి మీరంతా జాగ్ర‌త్త‌లు తీసుకోండి..సుర‌క్షితంగా ఉండండి అని మ‌లైకా అరోరా మెసేజ్ పోస్ట్ చేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.