బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 21:00:12

ఆ తప్పులు మళ్లీ చేయను: తాప్సీ

ఆ తప్పులు మళ్లీ చేయను: తాప్సీ

నాయికగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధిస్తుంది  ఢిల్లీ సొగసరి తాప్సీ. ప్రస్తుతం ఆమె హాసన్ దిల్‌రుబా బాలీవుడ్ చిత్రంతో పాటు జనగణమన తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో తాప్సీ నటించిన తప్పడ్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అవుతున్న తాప్సీ. ఇప్పుడిప్పుడే కెరీర్ ట్రాక్‌లో వుందని ఇకనుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తానంటోంది.

ఆ విషయాన్ని గురించి తాప్సీ మాట్లాడుతూ పరిశ్రమలో నాకంటూ గాడ్‌ఫాదర్‌లు ఎవరూ లేరు. ఎవరిని నమ్ముకొని నేను ఇక్కడికి రాలేదు. కేవలం నా శక్తి సామర్థ్యాలతోనే నాయికగా ఈ స్థాయికి చేరుకున్నాను. గతంలో పాత్రల ఎంపికలో నేను తీసుకొన్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు నా కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపించాయి. నా పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కొన్ని సినిమాల్ని చేయాల్సి వచ్చింది. వాటి వల్ల నటిగా చాలా కోల్పోయాను. ప్రస్తుతం ఆ తప్పుల్ని సరిదిద్దుకొనే ప్రయత్నాల్లో వున్నాను. ముఖ్యంగా బాలీవుడ్ విషయంలో వాటిని పునరావృతం చేయ‌కూడదని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo