బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 19:50:39

కడుపు మాడ్చుకోను: రాయ్‌లక్ష్మీ

కడుపు మాడ్చుకోను: రాయ్‌లక్ష్మీ

నేను ఎక్కువ ఫిట్‌గా ఉండడానికే ఇష్టపడతాను. నా బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకొని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. అయినా నా శరీరానికి జీరో సైజులు  అంతగా బాగోవు. అందుకే నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటోంది బెంగళూరు భామ లక్ష్మీరాయ్. ఇటీవల సోషల్‌మీడియాలో హాట్‌హాట్ ఫోటోలతో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో కాస్త బొద్దుగానే వుండేది.. ఇటీవలే కాస్త బరువు తగ్గిన రాయ్‌లక్ష్మీ ప్రస్తుతం పలు కన్నడ చిత్రాలతో బిజీగా వుంది. అయితే తను బరువు తగ్గడానికి అందరూ డైటింగ్ కారణమని అనుకుంటున్నారని..అయితే తాను మినిమమ్ వర్కవుట్స్‌తోనే సన్నబడ్డానని అంటోంది.

సైజ్‌జీరో కోసం తాను డైటింగ్ ప్రయోగాలు చేయలేదని కూడా అంటోంది.  అంతేకాకుండా కథానాయికగా తన విజయరహస్యం..నాకంటూ నేను పాటించే కొన్ని నియమాలే అంటోంది ఈ సుందరి. ఆ నియమాలను గురించి చెబుతూ నేను ఎవరిని అంత త్వరగా నమ్మను అలాగే  నాది కానిది దేన్నీ ఆశించను. నా అవసరానికి మించి ఎవరితోనూ అధికంగా సంభాషించను. అన్నింటికంటే ముఖ్యంగా  నేను ఎవరి ప్రేమకు అంత త్వరగా లొంగను అని చెబుతుంది లక్ష్మీరాయ్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo