మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 08, 2020 , 18:16:08

మతాన్ని నమ్మను..నేను భారతీయుడిని : అక్షయ్‌కుమార్‌

మతాన్ని నమ్మను..నేను భారతీయుడిని : అక్షయ్‌కుమార్‌

ముంబై: నేను ఏ మతాన్ని నమ్మను.. కేవలం నేనొక భారతీయుడినని మాత్రమే భావిస్తానన్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌. తన కొత్త చిత్రం ‘సూర్యవంశీ’ ఇదే సెంటిమెంట్‌ తో ప్రేక్షకుల ముందుకొస్తుందని అక్షయ్‌కుమార్‌ చెప్పాడు. అక్షయ్ మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..నేను ఏ మతాన్ని విశ్వసించను. కేవలం నేను ఒక భారీతీయుడినని ధృఢంగా నమ్ముతా. అదే విషయాన్ని సూర్యవంశీ సినిమాలో చూస్తారు. సినిమాలో ఏ పార్సీ, హిందూ, ముస్లిం వంటి మతాలుకానీ ఇతర మతాల గురించి కానీ ప్రస్తావన ఉండదని అన్నాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న మతపరమైన ఘర్షణలను స్మృషించేలా సినిమా ఉంటుందా అన్న విలేకర్ల ప్రశ్నకు అక్షయ్‌ సమాధానమిస్తూ..అది యాదృచ్చికంగా జరిగింది. మేం సినిమాలో కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అవసరమైన సినిమా ఇది అని అక్షయ్‌కుమార్‌ అన్నారు. 


logo