శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 16:07:34

నాకు ఎవ‌రి స‌ల‌హా అవ‌స‌రం లేదు: శృతిహాస‌న్

నాకు ఎవ‌రి స‌ల‌హా అవ‌స‌రం లేదు: శృతిహాస‌న్

క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత త‌న న‌ట‌న‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాస‌న్. స్వ‌తంత్ర భావాల‌తో విష‌య‌మేదైనా ముక్కుసూటిగా త‌న అభిప్రాయాన్ని చెప్పే న‌టి. సినిమా అనేది కేవ‌లం జీవితంలో ఓ భాగం మాత్ర‌మేన‌ని..సినిమానే జీవితం  కాద‌ని శృతిహాస‌న్ చెప్పింది. చిట్ చాట్ లో శృతిహాస‌న్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ..ఎవ‌రైనా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు పొంద‌క‌పోతే..ఇక కెరీర్ కు ముగింపు ప‌ల‌కాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్టు కాదంది.

ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌లో ఓ న‌టిగా ఉన్నందుకు నేను చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కే నా తొలి ప్రాధాన్య‌త. నేను ఎవ‌రి స‌ల‌హాను తీసుకోను. నాకు న‌చ్చిన‌ట్టు నా స్టైల్ లో జీవిస్తా. నా మ‌న‌స్సుకు ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు మాత్ర‌మే నేను చేస్తాన‌ని చెప్పుకొచ్చింది శృతిహాస‌న్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.