మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 21:00:28

నాకు ఏ హీరోతో అఫైర్లు లేవు

నాకు ఏ హీరోతో అఫైర్లు లేవు

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టించి త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అలనాటి అందాల తార ర‌వీనాటండ‌న్‌. కామెడీ, డ్రామా, యాక్ష‌న్ ఇలా అన్ని జోనర్ల‌లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రావ‌డం అంత సుల‌భంగా ఏం జ‌రగలేద‌ని  ర‌వీనాటండ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

బాలీవుడ్ లో కొన్ని క్యాంప్స్ న‌టీన‌టుల‌ను ఎలా టార్గెట్ చేస్తాయో ఇటీవ‌ల చ‌ర్చ జ‌రుగడం చూస్తున్నాం.  నాకు గాడ్ ఫాద‌ర్స్ లేరు. ఏ క్యాంపుల్లో నేను లేను. హీరోలు న‌న్ను ప్ర‌మోట్ చేయ‌రు. నేను పాత్ర‌ల కోసం ఏ హీరో ద‌గ్గ‌ర లొంగిపోలేదు. ఏ హీరోతో నాకు అఫైర్లు లేవు. కొంత‌మంది హీరోల‌ను ప‌ట్టించుకోకుండా నా ప‌ని నేను చేసుకుంటూ పోయాను. ఆశ్చ‌ర్య‌మేమిటంటే కొంద‌రు మహిళా జ‌ర్న‌లిస్టులే న‌న్ను ఎద‌గ‌కుండా అడ్డుప‌డేందుకు ప్ర‌య‌త్నించారు. నాకు న‌చ్చినట్టు జీవించ‌డ‌మంటే నాకిష్టం. అందుకే  చాలా మంది న‌న్ను అహంకారిగా భావిస్తారంటూ చెప్పుకొచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo