మంగళవారం 26 మే 2020
Cinema - May 07, 2020 , 18:08:29

అన్నయ్యతో క‌లిసి న‌టించ‌డం ఇష్టంలేదు : అల్లు శిరీష్‌

అన్నయ్యతో క‌లిసి న‌టించ‌డం ఇష్టంలేదు : అల్లు శిరీష్‌

అల్లు సిరీష్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా పెద్ద‌గా హిట్స్‌ రాలేదు. సినిమాల‌తో పాటు ప్ర‌ముఖ షోల‌కు హోస్ట్‌గా చేస్తూ స్పాంటెనిటీ హోస్ట్‌గా ఘ‌న‌త తెచ్చుకున్నాడు. ఇటీవ‌ల ప్ర‌ముఖ చాన‌ల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వూలో అల్లు అర్జున్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే మీరు ఎలా స్పందిస్తార‌న్న ప్ర‌శ్న‌కు శిరీష్‌ నిర్మొహ‌మాటంగా ఇష్టం లేద‌ని చెబుతాన‌న్నాడు. ఎందుకంటే.. బ‌న్ని ఇంత‌కుముందే చెప్పాడ‌ట‌. త‌న‌ స్టైల్‌ని ఫాలో అవ్వ‌కుండా నీకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకో అని, ప్ర‌త్యేక‌మైన కంటెంట్‌తో రూపొందించాల‌ని చెప్పాడ‌ట‌'. ఈ మాట‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోనంటున్నాడు శిరీష్‌‌.

సినిమాల్లో హీరోగా చేయ‌డం కంటే ప్ర‌ముఖ షోల‌కు హోస్ట్‌గా నిర్వ‌హించ‌డం చాలా క‌ష్టం అంటున్నాడు. దీన్ని స‌వాలుగా తీసుకొని ఫిల్మ్ అవార్డు ఫంక్ష‌న్ల‌ను నిర్వ‌హించ‌డానికి ఇష్ట‌ప‌డుతానంటున్నాడు. ఇంకా టిక్‌టాక్ అనుభ‌వం గురంచి చెప్పుకొచ్చాడు. స‌ల్మాన్‌ఖాన్‌, అమీర్ ఖాన్‌, హృతిక్ రోషన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి తన ఆలోచనలను కూడా శిరీష్‌ ఓ ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చాడు. logo