శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 17:18:06

శ్రావ‌ణిని పెండ్లి చేసుకోవాల‌నుకోలేదు: అశోక్ రెడ్డి

శ్రావ‌ణిని పెండ్లి చేసుకోవాల‌నుకోలేదు: అశోక్ రెడ్డి

హైద‌రాబాద్‌: టీవీ న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి ఇవాళ పంజాగుట్ట పోలీసు ముందు లొంగిపోయాడు. ఈ నేప‌థ్యంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ..శ్రావ‌ణి ఆత్మ‌హత్య కేసుకు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. తాను ఎప్పుడు శ్రావ‌ణిని పెండ్లి చేసుకోవాల‌ని అనుకోలేద‌ని, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అన్ని విష‌యాలు మాట్లాడ‌తాన‌ని చెప్పారు. తొలుత అశోక్ రెడ్డిని పోలీసులు వైద్య‌ప‌రీక్ష‌ల కోసం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్య‌ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత అశోక్ రెడ్డిని ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

అశోక్ రెడ్డిని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా న్యాయ‌మూర్తి ఎదుట ప్ర‌వేశ‌పెట్టి..త‌దుప‌రి ఆదేశాల మేర‌కు రిమాండ్కు త‌ర‌లించ‌నున్నారు. శ్రావ‌ణి కేసులో ఇప్ప‌టికే ఏ 1 నిందితుడు దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్ లో ఉన్నారు. సాయి, దేవ్‌రాజ్ రెడ్డి, అశోక్ రెడ్డి వేధింపుల వ‌ల్లే శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు ఇప్ప‌టికే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo