ఆదివారం 31 మే 2020
Cinema - May 19, 2020 , 17:03:28

నేను విడిపోవాలనుకోలేదు..ఆయనే వెళ్లిపోయారు

నేను విడిపోవాలనుకోలేదు..ఆయనే వెళ్లిపోయారు

ముంబై: బాలీవుడ్‌ యాక్టర్‌, డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్‌ నీలిమ అజీమ్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన విషయం తెలిసిందే. పంకజ్‌-నీలిమా అజీమ్‌కు షాహిద్‌ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌ సంతానం. పంకజ్‌ కపూర్‌  ఆ తర్వాత సుప్రియా పాఠక్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా పంకజ్‌ మొదటి భార్య నీలిమ తన వైవాహిక జీవితం గురించి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాను పంకజ్‌కపూర్‌ నుంచి విడిపోవాలనుకోలేదనేది మాత్రం వాస్తవమని నీలిమ అజీమ్ చెప్పింది. పంకజ్‌ కపూర్‌ కొన్ని కారణాల వల్ల నా నుంచి దూరమయ్యారు. పంకజ్‌కు నాకు మధ్య సుదీర్ఘమైన స్నేహబంధం ఉంది. పంకజ్‌ ను తొలిసారి కలిసినపుడు నా వయస్సు 15 ఏండ్లు. నా నుంచి విడిపోవడానికి పంకజ్‌కు కారణాలున్నాయి. అయితే మేమిద్దరం దూరమయ్యే సమయం వచ్చే సరికి (విడాకులు) ఇద్దరికీ చాలా కష్టంగా అనిపించింది. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. పంకజ్‌కపూర్‌ అతని కుటుంబంతో కలిసి బాగా స్తిరపడ్డారు. పంకజ్‌కపూర్‌ కుటుంబమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నీలిమ అజీమ్ఆకాక్షించింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo