ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 18:07:41

నేను దుస్తులు రిపీట్‌ చేస్తుంటాను: భూమి పెడ్నేకర్‌

నేను దుస్తులు రిపీట్‌ చేస్తుంటాను: భూమి పెడ్నేకర్‌

ముంబై: తాను సుస్థిరమైన ప్యాషన్‌  స్టైల్ నే   నమ్ముతానంటోంది బాలీవుడ్‌ అందాల తార భూమి పెడ్నేకర్‌. పర్యావరణ కార్యకర్త అయిన ఈ బ్యూటీ దుస్తులను మళ్లీమళ్లీ వేస్తుంటానని చెప్తోంది. చాలాసార్లు నేను ధరించే దుస్తులు పునరావృతం అవుతుంటాయి. నటిగా నన్ను కొత్త కొత్త దుస్తులు, డిఫరెంట్‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌ లో ఉండాలని కోరుకునే ప్రజలు..నన్ను ఎప్పుడూ ఓకే దుస్తుల్లో చూస్తారని నేను అనుకోవడం లేదు. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటివేవి నేను పట్టించుకోను. చాలా రకాల వ్యాపారాలున్నాయి. వాటిలో దుస్తులు అద్దెకు ఇచ్చే  ఆలోచన అద్భుతమైనదని చెప్పుకొచ్చింది భూమి.

ప్రస్తుతం ఈ హీరోయిన్‌ హిందీలో దుర్గావతి చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది. భూమి పెడ్నేకర్‌ ైక్లెమేట్‌ వారియర్‌ పేరుతో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్‌ వార్మింగ్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తనవంతు సేవలందిస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo