మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 19:39:37

న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది: రియా

న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది: రియా

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచార‌ణ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేర‌కు బీహార్ పోలీసులు సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా మ‌రో ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. బీహార్ పోలీసులు రియా ఇంటికెళ్ల‌గా..రియా క‌నిపించ‌కుండా పోయింది. అయితే తాజాగా రియా చ‌క్ర‌వ‌ర్తి ఓ వీడియో స్టేట్ మెంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రియా క‌న్నీరు పెడుతూ..నాకు దేవుడిపై, న్యాయ‌వ్య‌వ‌స్థ మీద న‌మ్మ‌క‌ముంది. నాకు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది. నా మీద ఎల‌క్ట్రానిక్ మీడియాలో భ‌యంక‌ర‌మైన విష‌యాలు మాట్లాడుతున్నారు. ఈ విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిధిలో ఉన్నందున లాయ‌ర్ల సూచ‌న మేర‌కు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. సత్య‌మేవ జ‌య‌తే..అంటూ ముగించింది. 

సుశాంత్‌ను రియాతో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు మాన‌సికంగా వేధించార‌ని, త‌న కుమారుడిని సూసైడ్ చేసుకునేలా ప్రోత్స‌హించార‌ని తండ్రి కేకే రాజ్‌పుత్ ఆరోపించారు. సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ఎక్క‌డికి బ‌దిలీ అయ్యాయ‌న్న కోణంలో ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ది. రియా ప‌రిచ‌యం అయ్యాకే సుశాంత్‌కు సినీ అవ‌కాశాలు త‌గ్గాయ‌ని, దాంతో అత‌ను మాన‌సికంగా వేద‌న‌కు గురైన‌ట్లు కేకే ఆరోపించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo