బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 00:14:05

చిరంజీవి స్ఫూర్తితో

చిరంజీవి  స్ఫూర్తితో

‘చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా.  ఆయన స్ఫూర్తితోనే నటుడినయ్యాను’ అని అన్నారు కృష్ణంరాజు. హాస్యనటుడు గౌతంరాజు తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన ‘కృష్ణారావు సూపర్‌మార్కెట్‌' చిత్రంలో హీరోగా నటించారు. గురువారం కృష్ణంరాజు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇంజినీరింగ్‌ చదివాను. కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలో అడుగుపెట్టాను.  నాన్న గౌతంరాజుకు తెలియకుండా సత్యానంద్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. తొలి చిత్రం ‘కృష్ణారావు సూపర్‌మార్కెట్‌' నుంచి నటుడిగా చాలా నేర్చుకున్నా. తప్పొప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం చేసుకున్నా.  చిరంజీవికి వీరాభిమానిని. ఆయన సినిమాలు చూసే నృత్యాల్లో, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా.  చిరంజీవి చేతుల మీదుగా ఎప్పటికైనా అవార్డును తీసుకోవాలన్నది నా కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా’ అని తెలిపారు. 

logo