‘కెరీర్ ప్రారంభం నుండి నేను భిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాను. కథకు నేను సరిపోతానని భావించిన సినిమాలే చేస్తూ వచ్చాను. భవిష్యత్‌లో కూడా వైవిధ్యమైన సినిమాలే చేస్తాను. రెగ్యులర్ పాత్రల్లో కూడా ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికే ఇష్టపడతాను’ అంటున్నారు యువ హీరో హవీష్. హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్న హవీష్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాతగా రవితేజతో ‘ఖిలాడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. హీరోగా మూడు భిన్నమైన సినిమాలను ఓకే చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ సినిమా, మరొకటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆ సినిమాలు వుంటాయి. తొలినుంచి మాది బిజినెస్ నేపథ్యం వున్న కుటుంబం కావడంతో హీరోగా నటిస్తూనే నిర్మాతగా కొనసాగటం పెద్దగా ఇబ్బందేమి లేదు. రవితేజతో తెరకెక్కిస్తున్న ‘ఖిలాడి’ చిత్రం ఆయన కెరీర్లో ఇంతవరకు చూడని ైస్టెలిష్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. హైదరాబాద్‌లో ఒక స్టూడియోతో పాటు ఒక యూనివర్శిటీని కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. యూనివర్శిటీని ఏషియాలోనే వన్‌ఆఫ్‌ది బెస్ట్ యూనివర్శిటీగా వుండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం’ అన్నారు.