బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 18:58:25

ప్రభాస్‌కు నేను సరైన జోడి!

ప్రభాస్‌కు నేను సరైన జోడి!

‘ఝమ్మందినాదం’తో తెలుగు తెరకు పరిచయమైన తార తాప్సీ.. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లోనాయికగా నటించింది. పింక్‌, తప్పడ్‌ చిత్రాలతో బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపునే సంపాందించుకుంది. సినిమాల్లోకి ప్రవేశించి పది వసంతాలు పూర్తిచేసుకున్న ఈ భామ ఇటీవల కెరీర్‌ తొలి రోజుల గురించి మాట్లాడుతూ ‘ తొలిరోజు ల్లో ప్రభాస్‌తో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చేసే అవకాశం వచ్చినప్పుడు కాస్త ఆలోచించాను. ఎందుకంటే అందులో రెండో నాయిక పాత్రను పోషిస్తే ఆ తరువాత వచ్చే అవకాశలన్నీ అలాగే వుంటాయని భయమేసింది.  కానీ ఆ తర్వాత అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మంచి పాత్ర వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అనే విషయాన్ని పట్టించుకోవద్దు అనుకున్నాను. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ నాయికగా నాకు మంచి పేరును తెచ్చింది. ప్రభాస్‌ ఎత్తుకు నేను బాగా సరిపోయానని, నాక్కూడ సినిమాలో మా జోడి బాగా వుందని అనిపించింది. సినిమా కూడా ఘనవిజయం సాధించడం నాకు ఎంతో ఆనందా న్నికలిగించింది’ అంటూ ఆ రోజులను గుర్తుచేసుకుంది తాప్సీ


logo