మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 21:44:38

నేను ఆరోగ్యంగానే ఉన్నా: సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ

నేను ఆరోగ్యంగానే ఉన్నా: సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, లివర్‌ ట్రాన్‌ప్లాంటేషన్‌ తర్వాత ఇప్పుడు కోలుకుంటున్నానని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. బుధవారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపారు. మళ్లీ పాటలు రాస్తున్నట్లు వెల్లడించారు. అయితే, కరోనా వల్ల బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం విషమించిందని ఏదో న్యూస్‌లో వచ్చినట్లు తెలిసిందని, అది నమ్మవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులను ఆయన కోరారు. తనకిప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాను ఆనందంగానే ఉన్నానని చెప్పారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo