జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెడీ మాత్రమే కాదు కాంట్రవర్సీలు కూడా చాలానే చేస్తుంటాడు. ఈయన స్కిట్స్ చూస్తే ఎంత నవ్వొస్తుందో.. అందులో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. ముఖ్యంగా కాన్ టెంపరరీ ఇష్యూస్ తీసుకుని దానిపై స్కిట్స్ చేస్తుంటాడు ఆది. దాంతో చాలా మంది మనోభావాలు దెబ్బ తింటూనే ఉంటాయి. హైపర్ ఆది స్కిట్స్ పేరుతో బాడీ షేమింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో కత్తి మహేష్ లాంటి వాళ్లు చాలానే రచ్చ చేసారు.
ఆ తర్వాత కూడా ఈయనపై విమర్శలు ఆగలేదు. కొన్ని రోజులుగా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న హైపర్ ఆది స్కిట్స్ మళ్లీ కాంట్రవర్సీ అయ్యాయి. ఈ సారి ఏకంగా ఓ భాషనే లక్ష్యంగా చేసుకున్నాడంటూ ఈయనపై పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది.తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దానికి కారణం ఈయన తెలంగాణ బాష, యాసను అవమానిస్తూ మాట్లాడటమే.
హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల కింద ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో తెలంగాణ ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మతో పాటు గౌరమ్మను, తెలంగాణ భాష యాసని అవమానపరిచేలా మాట్లాడాడంటూ ఈయనపై కేసు ఫైల్ చేసారు. తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా హైపర్ ఆది స్కిట్‌తో పాటు స్క్రిప్ట్ కూడా ఉందంటూ వాళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వెంటనే హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేసారు. అంతేకాదు స్క్రిప్ట్ రాసిన రైటర్.. నిర్మించిన మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు. ఆదిపై ఇలాంటి కేసులు ఫైల్ కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు మనోడిపై పోలీసు కేసులు ఫైల్ అయ్యాయి. కామెడీ కోసం కొన్నిసార్లు అలాంటివి చేసినపుడు కామెడీగానే చూడాలి కానీ సీరియస్ గా తీసుకోకూడదు అంటున్నాడు ఈ కమెడియన్. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది