శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 11:27:47

ప్ర‌భాస్ ఫోటోతో హైద‌రాబాద్ పోలీస్ ట్వీట్

ప్ర‌భాస్ ఫోటోతో హైద‌రాబాద్ పోలీస్ ట్వీట్

రోడ్డు ప్ర‌మాదాల వ‌లన నిత్యం ఎన్నో వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్న‌ప్ప‌టికీ వాటిని బేఖాత‌రు చేయ‌కుండా ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌జ‌ల‌లో మ‌రింత అవగాహ‌న పెంచేందుకు మిర్చి సినిమాలో ప్ర‌భాస్ హెల్మెట్ పెట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నీ మీద మీ జీవితమే కాదు.. మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి  ఉన్నాయ్ , హెల్మెట్ ధరించండి.. అని ట్వీట్ చేశారు.

ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రోజు హైద‌రాబాద్ పోలీసులు ఈ ట్వీట్ చేయ‌డంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. నేడు 41వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన ప్ర‌భాస్‌కు మ‌హేష్‌, కాజ‌ల్‌, నాగబాబు, హ‌రీష్ శంక‌ర్, మెహ‌ర్ ర‌మేష్‌, సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు.