బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 17:33:01

గ‌మ‌నం మూవీ..హైద‌రాబాదీ ప్రేమికుల లుక్ వైర‌ల్‌

గ‌మ‌నం మూవీ..హైద‌రాబాదీ ప్రేమికుల లుక్ వైర‌ల్‌

శ్రియ‌ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు గ‌మ‌నం. సుజ‌నారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో నిత్య‌మీన‌న్‌, ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే శ్రియ‌, నిత్య‌మీన‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి పాత్ర‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఇద్ద‌రు హైద‌రాబాద్ ప్రేమికులు అలీ, జ‌రా పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. అలీ వైట్ జెర్సీ లో స్పోర్ట్స్ లుక్ లో క‌నిపిస్తుండ‌గా..జ‌రా కంప్లీట్ గ్రీన్ పంజాబీ డ్రెస్ లో న‌వ్వుతూ క‌నిపిస్తుంది. కొత్త స్టిల్ చూస్తుంటే గ‌మ‌నం చిత్రంలో ఈ ప్రేమికులకు సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. 

ఈ ప్రాజెక్టులో శ్రియ సాధార‌ణ గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. నిత్య‌మీన‌న్ క్లాసిక‌ల్ సింగ‌ర్ శైల‌పుత్రీ దేవి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు స‌మ‌కూరుస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూ..మ‌రోవైపు ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‌'గ‌మ‌నం' చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo