బుధవారం 03 జూన్ 2020
Cinema - May 22, 2020 , 23:07:30

ఎంతందంగా ఉన్నాడో..

ఎంతందంగా ఉన్నాడో..

నాగచైతన్య, సమంత దంపతులు అన్యోన్యంగా ఉంటారు. తమ మధ్య ఉన్నగాఢానుబంధాన్ని, ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేసుకునే విషయంలో ఏమాత్రం సంశయించరు. ముఖ్యంగా సమంత సోషల్‌మీడియా వేదికగా అనేక ఫొటోల్ని పంచుకుంటూ చైతన్యపై ఉండే అనురాగాన్ని చాటుతుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘నా భర్త చూడండి..ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో కదా..’ అంటూ నాగచైతన్య నవ్వుతూ ఉన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది సమంత. ‘మా అమ్మకు, అత్తయ్యకు, చెల్లికి, స్నేహితులకు పంపిన తర్వాత ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్నా. నా కామెంట్స్‌ వింటే నా భర్త గొయ్యిలోకి దూకుతారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ‘డబ్బులిచ్చి పోస్ట్‌ పెట్టించినట్లుగా పెయిడ్‌ పార్ట్‌నర్‌షిప్‌లా వుంది ఈ పని’ అంటూ ఈ ఫొటోపై చమత్కరించారు చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవల రానా, మిహీక బజాజ్‌ జంట పెళ్లి గురించి ఇరు కుటుంబాల పెద్దలు కలిసి  చర్చించుకున్నారు. ఈ   వేడుకలో చైతన్య, సమంత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన నాగచైతన్య ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.logo