గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 08:47:21

బిగ్ బాస్ 4: ఆప్ష‌న్ లేక ఆరుబ‌య‌టే!

బిగ్ బాస్ 4: ఆప్ష‌న్ లేక ఆరుబ‌య‌టే!

బిగ్ బాస్ సీజ‌న్‌4 కార్య‌క్ర‌మంలో భాగంగా సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు సంబంధించిన టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ మంగ‌ళ‌వారం రోజు ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో  రోబోలు-మనుషులు అంటు రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ప్రేక్ష‌కుల‌ని రంజింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ టాస్క్ డబ్ల్యుడ‌బ్ల్యుఎఫ్‌ని త‌ల‌పించింది. కొంద‌రు గాయాల బారిన ప‌డ‌డం, మ‌రి కొంద‌రు ఆప్ష‌న్ లేక ఆరుబ‌య‌టే టాయిలెట్‌కు వెళ్ళ‌డం చేశారు.

తాజా ఎపిసోడ్‌లో మోనాల్ ఇంటి స‌భ్యుల‌కు తెలుగు ప‌ద్యం నేర్పే ప్ర‌య‌త్నం చేసింది. ముద్దుగా ముద్దుగా ఆమె తెలుగు మాట్లాడుతుండడంతో హౌజ్‌మేట్స్‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కులు కూడా తెగ ఎంజాయ్ చేశారు. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ అవినాష్‌.. మోనాల్‌తో కొద్దిసేపు స‌ర‌దాగా గ‌డిపాడు. ఆమెపై ప్రేమ‌లు పాడుతూ ఇంప్రెస్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.  హలో గురూ ప్రేమకోసమేరా జీవితం అంటూ.. పాట అందుకోవడమే కాకుండా నాగార్జున‌ని ఇమిటేట్ చేసే ప్ర‌యత్నం చేసి కొద్ది సేపు వారిని ఎంట‌ర్‌టైన్ చేశాడు. 

ఆ త‌ర్వాత ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఉక్కు హృదయం అనే  టాస్క్ ఇచ్చారు. ఇందులో రోబోలు VS మనుషులు ఉంటారు. రోబోలకి సంబంధించిన సిల్వ‌ర్ బాల్‌ని ప‌గ‌ల‌గొడితే మ‌నుషులు విజేత‌లుగా నిలుస్తార‌ని చెప్పారు బిగ్ బాస్. మ‌రోవైపు రోబోలు ఎప్ప‌టిక‌ప్పుడు ఛార్జింగ్ చేసుకోవాల‌ని కూడా అన్నారు. గెలిచిన టీం నుండి వ‌చ్చే వారం ఒకరు కెప్టెన్‌గా ఎంపిక అవుతారంటూ స్ప‌ష్టం చేశారు బిగ్ బాస్ 

16 మంది స‌భ్యుల‌లో రోబో టీంలో అభిజిత్, దేవి, లాస్య, అవినాష్, కుమార్, గంగవ్వ, హారిక, అరియానాలు ఉండ‌గా, మనుషుల టీం.. అఖిల్, మొనాల్, అమ్మా రాజశేఖర్, నోయల్, మొహబూబ్, దివి, సుజాత, సొహైల్‌లు ఉన్నారు.  టాస్క్ ప్రారంభం కాక ముందే వీరు ముందు జాగ్ర‌త్త‌గా ఫుడ్ ఐటెంస్ అన్నీ దోచుకున్నారు.  సీక్రెట్ ప్లేస్‌ల‌లో వాటిని పెట్టుకున్నారు. ఈ ఫుడ్ దోచుకునే క్ర‌మంలో పెరుగు డ‌బ్బాని కూడా ప‌డేశారు. 

చిన్న‌పాటి యుద్ధాన్ని త‌ల‌పించిన ఈ టాస్క్‌లో గంగవ్వ కూడా ఉత్సాహంగా పాల్గొంది. బెల్ మోగ‌గానే సిల్వ‌ర్ బాల్‌ని ప‌గ‌ల‌గొట్టేందుకు మ‌నుషుల టీం ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. ఎట్ట‌కేల‌కు దేవికు సంబంధించిన బాల్ ప‌గ‌ల‌గొట్ట‌డంతో ఆమె చ‌నిపోయిన‌ట్టు భావించారు. అయితే రోబోలకు ఇంటి స‌దుపాయాలు వాడుకునే అవ‌కాశం బిగ్ బాస్ ఇవ్వ‌గా, మ‌నుషులు మాత్రం బ‌య‌టే ఉండిపోయారు.

ఒకవేళ మ‌నుషులు ఫుడ్, వాష్ రూం తదితర సౌకర్యాలను వాడుకోవాలంటే రోబోలకు చార్జ్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే రోబోలకు చార్జ్ ఇవ్వడం ఇష్టం లేని మనుషులు వాష్ రూం వ‌చ్చిన కూడా కొద్దిసేపు ఓపిక ప‌ట్టారు. చివ‌రికి చేసేదేం లేక బెడ్ షీట్‌లు, పిల్లోస్ మ‌నుషుల టీంలో మిగ‌తా స‌భ్యులు అడ్డు పెట్ట‌డంతో సుజాత‌, మోనాల్‌లు ఆరుబ‌య‌టే ప‌ని కానిచ్చేరు. ఈ విష‌యంలో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు.  కెమెరాలను క్లోజ్ చేయడం ఆటకు విరుద్ధం అని.. ఇంకోసారి ఇలా చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

త‌ను రీచార్జ్ అయ్యేందుకు బ‌య‌ట‌కు వెళ‌తాన‌ని, ఓడిపోవ‌డం అస్స‌లు ఇష్టం లేదని అభిజిత్‌తో కొద్దిసేపు అరియానా వాదించింది. చివ‌రికి అత‌ను ఇదే నీ క్యారెక్టర్ పోయి ఆడుకో అంటూ సీరియస్ అయ్యాడు. ఇక ఈ రోజు కూడా ఇదే రచ్చ కొన‌సాగ‌నుండ‌గా, దీనికి సంబంధించిన ప్రోమో కూడా వ‌దిలారు. ఇందులో దివి మెల్ల‌గా రోబోల రూంకి వెళ్ళ‌డంతో ఆమెని బంధించడం, ఇది చూసి మ‌నుషుల టీంలో ఉన్న సోహైల్ ఫుల్ ఫైర్ కావ‌డం ప్రోమోలో గ‌మ‌నించ‌వ‌చ్చు.


logo