శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 21:09:14

'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!

'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!

కేజిఎఫ్ చాప్టర్ 2పై ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం కన్నడ ఇండస్ట్రీ మాత్రమేకాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. బాహుబలి తర్వాత ఓ దక్షిణాది సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు వేచి చూడడం ఇదే తొలిసారి. అంతటి భారీ అంచనాలు మోసుకొని వస్తుంది KGF 2. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ కూడా రెండో భాగానికి చాలా పెంచేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తొలి భాగం కోసం దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు నిర్మాతలు. దానికి తగ్గట్టుగానే బిజినెస్ జరిగింది. కలెక్షన్స్ కూడా దాదాపు 200 కోట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే రెండో భాగం కోసం ఏకంగా 140 నుంచి 160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

దానికి తోడు తొలి భాగంతో పోలిస్తే రెండో భాగానికి పారితోషికం కూడా చాలా పెరిగింది. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ నేషనల్ స్టార్ అయిపోయాడు. తొలి భాగం కోసం ఆయన దాదాపు 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కన్నడ ఇండస్ట్రీలో 11 కోట్లు తీసుకోవడం గొప్ప విషయమే. అయితే ఈ ఒక్క సినిమా కోసమే రెండేళ్లకు పైగా డేట్స్ ఇచ్చాడు ఈ హీరో. అందుకే రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకున్నాడు. ఇదిలా ఉంటే పార్ట్ 2 కోసం రాకింగ్ స్టార్ రెమ్యూనరేషన్ 30 కోట్లకు చేరుకుందని ప్రచారం జరుగుతుంది. పైగా లాభంలో షేర్ కూడా తీసుకుంటున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలిభాగం విజయం సాధించిన తీరు చూసిన తర్వాత రెండో భాగానికి హీరో యష్ 30 కోట్లు తీసుకోవడం న్యాయమే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే చాప్టర్ 2 బిజినెస్ దాదాపు 200 కోట్ల దాటిపోతుంది. అది కూడా కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. 

డిజిటల్ శాటిలైట్ కలుపుకుంటే మరో 50 నుంచి 70 కోట్ల వరకు నిర్మాతలకు అదనంగా వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే దాదాపు 270 కోట్ల బిజినెస్ చేస్తుంది కేజిఎఫ్ 2. అందులో హీరోకు ఒక 30 కోట్లు ఇవ్వడం అనేది చాలా రీజనబుల్ అని విశ్లేషకుల అంచనా. కేవలం హీరో మాత్రమే కాదు.. హీరోయిన్, దర్శకుడు, తొలి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన కొందరు నటులకు కూడా చాప్టర్ 2 కోసం భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. కొన్ని ప్యాచ్ వర్కులు మాత్రం మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు దర్శకుడు ప్రశాంత్. అన్నీ కుదిరితే ఆగస్టులో కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కానుంది. ఈ సినిమాను కేవలం ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని భాషల్లో కూడా అనువదిస్తున్నారు. ఏదేమైనా బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచేస్తే.. కన్నడ సినిమాను ఆకాశమంత ఎత్తు చేర్చింది కేజిఎఫ్.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo