లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది..? హీరోలు లేకుండా కూడా ఈమె కాసుల పంట పండిస్తుంది. థియేటర్స్ మూసేసిన సమయంలోనూ నిర్మాతలకు కలెక్షన్స్ పంట పండిస్తుంది నయన్. కేవలం ఈమె ఇమేజ్ తోనే సినిమాలకు వరాల జల్లు కురుస్తున్నాయి. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కొనసాగిస్తుంది నయన్. చేతిలో ఎప్పుడూ కనీసం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరో చాలెంజింగ్ రోల్ చేస్తుంది నయనతార. కెరీర్ లో తొలిసారి అంధురాలుగా నటిస్తుంది. ఇదివరకే నేను రౌడీనే సినిమాలో చెవిటి అమ్మాయిగా నటించి అవార్డులు సొంతం చేసుకుంది.
ఇప్పుడు మరోసారి అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తోంది నయనతార. నెట్రికన్ సినిమాలో బ్లైండ్ పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. నేట్రికన్ సినిమాలో ఈమె అంధురాలిగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ గాని లేకపోయి ఉంటే గత ఏడాది నవంబర్లో అనే సినిమా విడుదల అయి ఉండేది. కానీ మధ్యలో కరోనా వైరస్ వచ్చి అన్ని ప్లాన్స్ పాడు చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా చాలా బాగుంటుంది అని బలంగా నమ్ముతోంది నయనతార. ఈ సినిమాను మిలింద్ రావు తెరకెక్కిస్తున్నాడు. గతంలో సిద్ధార్థ్ హీరోగా గృహం సినిమాను తెరకెక్కించాడు.
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన గృహం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు నయనతార నేట్రికన్ సినిమాతో ఖచ్చితంగా మరో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై పూర్తి క్లారిటీ రానుంది. హాట్ స్టార్ ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయిలో ఆఫర్ రావడం చిన్న విషయం కాదు. వారం రోజుల్లోనే ఈ చిత్ర విడుదలపై క్లారిటీ రానుంది. గతంలో నయనతార నటించిన అమ్మోరు తల్లి సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదలైంది.
ఇవి కూడా చదవండి..
లవ్ స్టోరీని డైరెక్ట్ చేయనున్న యువ హీరో..?
నితిన్ ‘జయం’కు 19 ఏండ్లు..ఆ రోజుల్లోనే సంచలన వసూళ్లు
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే