ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 19:46:34

ప్రభాస్ కోసం హాస్పటల్ నిర్మాణం..నిజమేనా?

ప్రభాస్ కోసం హాస్పటల్ నిర్మాణం..నిజమేనా?

టైటిల్ చూస్తే అనేక రకాలుగా డౌట్స్ రావడం సహజం. ఎందుకంటే ప్రభాస్ ఇటీవలే ప్రస్తుతం తను చేస్తున్న ‘ఓ డియర్’ (ప్రస్తుతం వినిపిస్తున్న టైటిల్) చిత్ర షూటింగ్ ముగించుకుని వచ్చి.. కరోనా వైరస్ కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్నాడు. అతను స్వీయ నిర్భందంలో ఉన్నాడనే వార్తే కానీ, తదుపరి అతని హెల్త్‌కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ బయటికి రాలేదు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ కోసం హాస్పటల్ అనే వార్త బయటికి రావడం ఆయన అభిమానులను కాస్త కలవరపరచడం ఖాయం. అయితే ఈ హాస్పటల్ అతని ఆరోగ్యానికి సంబంధించి కాదు... అతని సినిమాకు సంబంధించి నిర్మాణం జరుపుకోబోతోంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ప్రభాస్ చేస్తున్న చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ ఇటలీలో జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఇటలీ పరిస్థితి దారుణంగా ఉండటంతో చిత్రయూనిట్ ఈ షెడ్యూల్ కోసం ఓ సెట్‌ను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్లుగా వినబడుతుంది. ఇందుకోసం హైదరాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో భారీ హాస్పటల్ సెట్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో మూడు భారీ సెట్స్ నిర్మించారు. ఇటలీలో షూట్ చేయాలనుకున్న షూటింగ్ అంతా ఓ హాస్పటల్ నేపథ్యంలో ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.


logo