సాధారణంగా రీమేక్ సినిమాలు చేసేటప్పుడు రెండు రకాలుంటాయి. కేవలం థీమ్ తీసుకుని మన అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేసుకోవడం.. లేదంటే ఉన్నదున్నట్టు దించేయడం. ఈ రెండు రకాల రీమేక్స్ ఉంటాయి. చిరంజీవి ఈ రెండూ చేసాడు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాను ఉన్నదున్నట్టు దించేసారు.. ఫ్లాప్ అయింది. మరోవైపు శంకర్ దాదా ఎంబిబిఎస్ మనకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసారు.. సూపర్ హిట్ అయింది. కథ, కథనాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. చిరు ప్రస్తుతం లూసీఫర్ రీమేక్ లో నటించడానికి ఓకే చెప్పాడు. ఆచార్య పూర్తి కాకముందే మరో రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ చేసాడు. అందులో లూసీఫర్ రీమేక్ ముహూర్తం కూడా పెట్టేసాడు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.
మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగులో కూడా విడుదలైంది. అయినా కూడా కథ నచ్చి ఇక్కడ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రం కోసం సీనియర్ రైటర్ సత్యానంద్ తో పాటు లక్ష్మీ భూపాల కూడా పని చేస్తున్నాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు చిరుకు సన్నిహితులైన రైటర్స్ టీం కూడా ఉన్నారు. నిజానికి ఎప్పుడో ఏప్రిల్ లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా మరింత ఆలస్యం అయింది. ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. లూసీఫర్ పూర్తిగా స్టోరీ డ్రివెన్ సినిమానే. మలయాళంలో కనీసం హీరోయిన్ కూడా ఉండదు. కానీ తెలుగులో చిరంజీవి కోసం కథలో మార్పులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక్కడ హీరోయిన్ ఉంటుందని.. నయనతార ఆ పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. మలయాళం లూసీఫర్ లో మోహన్ లాల్ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత కానీ ఎంట్రీ ఇవ్వడు. తెలుగులో మాత్రం చిరుతోనే సినిమా ఓపెన్ అవుతుందని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కొన్ని టైటిల్స్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ రీమేక్ కు ‘కింగ్ మేకర్’ టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే టైటిల్ కావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?