బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 21:08:10

విజయ్ దేవరకొండపై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా..?

విజయ్ దేవరకొండపై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా..?

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈయన కంటే ముందు నాని కూడా అలాగే ఎదిగాడు. కానీ విజయ్ కు వచ్చినంత మార్కెట్ మాత్రం నానికి రాలేదనే చెప్పాలి. ఆయన సాఫీగా ప్రతీ సినిమాతో ముందుకు వెళ్తున్నాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అలా కాదు..రయ్ మంటూ దూసుకొచ్చాడు. ఈయన నటించిన అర్జున్ రెడ్డి 25 కోట్లు.. గీత గోవిందం 60 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత టాక్సీవాలా కూడా దాదాపు 20 కోట్ల వరకు వసూలు చేసింది. అలా ఉన్నట్లుండి విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోయింది. అయితే కొన్నేళ్లుగా ఈయన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. టాక్సీవాలా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. అలాంటి సమయంలో పూరీ జగన్నాధ్ లాంటి మాస్ డైరెక్టర్ ఈయనతో లైగర్ సినిమా చేస్తున్నాడు. 

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అభిమానులు చేస్తున్న హంగామా చూసి నిజంగానే అందరికీ పిచ్చెక్కిపోతుంది. నిజంగా విజయ్ దేవరకొండకు ఇంత ఇమేజ్ ఉందా.. అభిమానులు ఈయన్ని అంతగా ఆరాధిస్తున్నారా అంటూ షాక్ అవుతున్నారు. లైగర్ ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అభిమానుల బీరాభిషేకాలు, అలాగే టాటూలు వేయించుకోవడాలు చూసి అంతా పరేషాన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లైగర్ కోసం ఏకంగా ఒకటి రెండు కాదు 125 కోట్లు పెడుతున్నారని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు లైగర్ బడ్జెట్ ఆసక్తికరంగా మారిపోయింది. 

ఎందుకంటే విజయ్ దేవరకొండపై 125 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. విజయ్ దేవరకొండ మార్కెట్ బట్టి చూసినా.. ఈయన ట్రాక్ రికార్డు బట్టి చూసినా కూడా ఇది చాలా ఎక్కువ. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ కోసం వేసిన బాక్సింగ్ సెట్ లో లైగర్ కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నాడు పూరీ జగన్నాథ్. ఈ ఫైట్ అంతా విదేశీ ఫైటర్స్ తోనే ఉండబోతుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడనటువంటి బాక్సింగ్ దృశ్యాలు ఇందులో కనిపించబోతున్నాయి. ఈ సన్నివేశాలే మేజర్ హైలెట్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ జరుపుకున్న లైగర్.. ఇకపై మొదలు కాబోయే షెడ్యూల్ తో పూర్తి కానుంది. ఈ సినిమాలో విజయ్ తండ్రిగా, మాఫియా డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుంది. ఏదేమైనా కూడా 125 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు.

ఇవి కూడా చ‌ద‌వండి..

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న‌ కేథ‌రిన్

గోవాలో స‌న్నీలియోన్ హాట్ ఫొటోషూట్

అటు కేర‌ళ అందాలు..ఇటు సోనాక్షి వ‌య్యారాలు

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo