గురువారం 04 జూన్ 2020
Cinema - May 04, 2020 , 15:58:20

ఏడు గంట‌ల క‌ష్టం..వృధాగా పోలేదంటున్న హృతిక్

ఏడు గంట‌ల క‌ష్టం..వృధాగా పోలేదంటున్న హృతిక్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ క‌ష్టానికి కేరాఫ్ అడ్రెస్ అని చెప్ప‌వ‌చ్చు. అత‌ని సినిమాలు చూస్తే, హృతిక్ త‌న ప్ర‌తి సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అర్ధ‌మ‌వుతుంది. తాజాగా హృతిక్ రోష‌న్ క‌రోనా పోరులో భాగంగా ఏడు గంట‌లు పాటు కృషించి పియానో వాయించ‌డంతో పాటు పాట పాడ‌డం నేర్చుకున్నాడు. అత‌ని ప్ర‌తిభ‌కి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

క‌రోనా పోరులో భాగంగా విరాళాలు సేక‌రించేందుకు దాదాపు 85 మంది ప్ర‌ముఖులు "ఐ ఫ‌ర్ ఇండియా" లైవ్ క‌న్స‌ర్ట్ లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పాల్గొన్న వారు త‌మ ఇళ్ళ‌ల్లోనే ఉంటూ పాట‌ల‌తో క‌రోనాపై చైత‌న్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.  ఇందులో భాగంగా తాను పాడే పాట కోసం స్పెష‌ల్‌గా పియానో వాయించ‌డం నేర్చుకున్నాడు. పాట‌కి త‌గ్గట్టు సంగీతాన్ని స‌మ‌కూరుస్తూ వారెవ్వా అనిపించాడు. ఏడుగంటల పాటు ప‌డ్డ ఈ క‌ష్టం అభిమానుల ప్ర‌శంస‌ల‌తో  తిరిగి పొందిన‌ట్టు అయింద‌ని హృతిక్ చెబుతున్నాడు.  అత‌ని టాలెంట్‌కి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారుlogo