శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 12:20:38

సుశాంత్ మృతిపై స్పందించిన హృతిక్ త‌ల్లి

సుశాంత్ మృతిపై స్పందించిన హృతిక్ త‌ల్లి

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌కు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు నెల‌కొనగా, ప్ర‌స్తుతం సీబీఐ ఈ కేసుని లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంది. సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణం నెపోటిజం అని కొంద‌రు కామెంట్ చేయ‌గా, మ‌రికొంద‌రు వ‌ర్క్ ఇష్యూస్  అని అన్నారు.

సుశాంత్ మ‌ర‌ణం ఇంకా మిస్ట‌రీగానే ఉండ‌గా, త్వ‌ర‌గా సానుకూల తీర్పు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే సుశాంత్ మ‌ర‌ణించిన బాలీవుడ్ అగ్ర హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చాలా వ‌చ్చాయి. హృతిక్ రోష‌న్‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో హృతిక్ తల్లి రీసెంట్ గా త‌న సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేస్తూ అంద‌రి అనుమానాల‌ని ప‌టాపంచ‌లు చేసింది.  ప్రతీ ఒక్కరికీ నిజం ఏమిటీ అన్నది కావాలి కానీ ఎవరూ కూడా నిజాయితీగా ఉండరు” అని సుశాంత్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో సుశాంత్‌కు హృతిక్ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవ‌ని తేట‌తెల్ల‌మైంది.