మంగళవారం 26 మే 2020
Cinema - May 12, 2020 , 10:33:33

మ‌ళ్ళీ క‌ల‌వ‌డానికి కార‌ణం చెప్పిన హృతిక్ మాజీ భార్య‌

మ‌ళ్ళీ క‌ల‌వ‌డానికి కార‌ణం చెప్పిన హృతిక్ మాజీ భార్య‌

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ అత‌ని భార్య సుసానే ఖాన్ విడాకుల కార‌ణంగా కొద్ది రోజుల నుండి దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్ కోసం అప్పుడ‌ప్పుడు క‌లిసి విహార‌యాత్ర‌ల‌కి వెళుతుంటారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన త‌మ పిల్ల‌ల క్షేమ ర‌క్ష‌ణ కోసం సుసానే ఖాన్ తిరిగి త‌న మాజీ భ‌ర్త ఇంటికి చేరుకుంది ‌. ఈ విష‌యాన్ని హృతిక్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా కొద్ది రోజుల క్రితం స్ప‌ష్టం చేశారు.

తాజాగా సుసానే ఖాన్ త‌న మాజీ భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌డానికి కార‌ణం చెప్పుకొచ్చింది. ఇలాంటి స‌మ‌యంలో ఇద్దరి పిల్ల‌ల‌కి త‌మ అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీనిని  ‘తెలివైన ,మనోహరమైన’ చర్యగా అభివ‌ర్ణిస్తాను. ప్రశాంత‌త కోసం ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ముందుగానే భావించాము. ఆ ఆలోచ‌న‌ని దృష్టిలో పెట్టుకొని ప్రేమ‌తో ఈ లాక్‌డౌన్ సాహ‌సాన్ని ప్రారంభించాము . మొద‌టి రోజు కార్య‌క‌ల‌పాల జాబితాని రూపొందించాం. ఈ ఆలోచ‌న మన మనస్సులను ఉల్లాసంగా ఉంచుకోవ‌డానికి, ఆరోగ్యాన్ని ఉత్తేజంగా ఉంచుకోవ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సుసానే పేర్కొంది. 


logo