శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 11:15:34

ముందు క‌రోనా, తర్వాత‌ సిగ‌రెట్ అంతం చేస్తానంటున్న ‌క్రిష్‌

ముందు క‌రోనా, తర్వాత‌ సిగ‌రెట్ అంతం చేస్తానంటున్న ‌క్రిష్‌

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ స‌మ‌యాన్ని త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. వీరికి తోడుగా హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా ఇందులో భాగం అవుతున్నారు. రీసెంట్‌గా హృతిక్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి బాల్కనీలో ముచ్చ‌టిస్తుండ‌గా, సుశానే కెమెరా క్లిక్ మ‌నిపించింది. అంతేకాదు ఈ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో ఫుల్ వైర‌ల్ కాగా, ఇందులో హృతిక్ చేతిలో సిగ‌రెట్ ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపించారు. 

స్టార్ హీరో అయి ఉండి ఇలా పిల్ల‌ల‌తో సిగరెట్ తాగువాతా అంటూ కొంద‌రు హృతిక్ తీరుపై మండిప‌డ్డారు. ఓ నెటిజ‌న్ డైరెక్ట్‌గా మీరు సిగ‌రెట్ తాగుతారా అని హృతిక్‌ని ప్ర‌శ్నించారు. దీంతో వీటికి అడ్డుక‌ట్ట వేయాలంటే తాను డైరెక్ట్‌గా రంగంలోకి దిగాల‌ని భావించిన క్రిష్ .. నాకు సిగరెట్ స్మోకింగ్ అల‌వాటే లేదు. నేను క్రిష్‌( అతేంద్రియ శ‌క్తుల‌న్న పాత్ర‌)ని. మొట్ట‌మొద‌ట వైర‌స్‌ని నిర్మూలించి ఆ త‌ర్వాత సిగ‌రెట్‌ని అంతం చేస్తాన‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు . అయితే ఇంత ర‌చ్చ జ‌ర‌గడానికి కార‌ణం సుశానే తీసిన ఫోటో. ఇందులో మ‌నం గ‌మ‌నిస్తే హృతిక్ చేతిలో సిగ‌రెట్ ఉన్న‌ట్టు అనిపిస్తుంది.


logo