మంగళవారం 14 జూలై 2020
Cinema - Apr 08, 2020 , 22:47:32

ఆకలితో ఉండకూడదు

ఆకలితో ఉండకూడదు

కరోనా మహమ్మారి కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదవారిని ఆదుకునేందుకు బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ ముందడుగు వేశారు . లాక్‌డౌన్‌ కొనసాగినన్నీ రోజులు ప్రతి దినం లక్ష ఇరవై వేల మంది నిరుపేదలకు ఆహారాన్ని అందించబోతున్నారు. అక్షయపాత్ర పౌండేషన్‌తో కలిసి హృతిక్‌రోషన్‌ ఈ సహాయాన్ని అందించనున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి  ఉండకూడదని, పెద్ద, చిన్నా అనే భేదాలు ఎవరికి సాధ్యమైన రీతిలో వారు సాయం చేయడానికి ముందుకు రావాలని హృతిక్‌రోషన్‌ చెప్పారు.


logo