మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 04, 2020 , 12:15:26

బ‌న్నీ డ్యాన్స్‌పై హృతిక్ కామెంట్స్‌

బ‌న్నీ డ్యాన్స్‌పై హృతిక్ కామెంట్స్‌

గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోష‌న్ తాజాగా సౌత్ హీరోస్ అల్లు అర్జున్‌, విజ‌య్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వారు ఎలాంటి సీక్రెట్ డైట్ మెయింటైన్ చేస్తారో తెలుసుకోవాలి, అలానే డ్యాన్స్ చేసే ముందు ఏం తింటారో కూడా క‌నుక్కోవాల‌ని ఉంద‌ని హృతిక్ పేర్కొన్నారు. బ‌న్నీ డ్యాన్స్ గురించి ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న ఎన‌ర్జిటిక్, స్ట్రాంగ్‌, స్పూర్తిదాయ‌కం అని పేర్కొన్నాడు. అలానే త‌మిళ హీరో విజ‌య్ గురించి మాట్లాడుతూ.. నాకు తెలిసి వారు సీక్రెట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క‌రి ఎన‌ర్జీలెవ‌ల్స్ బాగుంటాయ‌ని హృతిక్ అన్నారు.

త‌న సినిమాల ఎంపిక గురించి మాట్లాడిన హృతిక్ రోష‌న్ 30 నిమిషాల‌లో ఏ సినిమానైన ఓకే చేస్తాన‌ని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఎంపిక చేసుకునేట‌ప్పుడు ఒక ప్ర‌శ్న కూడా లేకుండా ఉండాలి. 30 నిమిషాల‌లో నేను ప్రాజెక్ట్‌కి ఎస్ చెప్ప‌లేదు అంటే  ఆ సినిమా ఇక చేయ‌న‌నే అర్ధం అని హృతిక్ ప్ర‌ముఖ వెబ్‌సైట్‌కి తెలియ‌జేశారు. 


logo