గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 16, 2020 , 08:42:34

ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దా గేమ్స్ ఆడించిన నాగ్

ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దా గేమ్స్ ఆడించిన నాగ్

బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్‌ఫుల్‌గా ప‌ది వారాలు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఎనినిది మంది సభ్యులు ఉండ‌గా, కుమార్ సాయి రీఎంట్రీ ఇస్తాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం ఎపిసోడ్ చాలా స‌ర‌దాగా ఎమోష‌న‌ల్‌గా సాగింది. ఇంటి స‌భ్యులతో స‌ర‌దా ఆట‌లాడించిన నాగార్జున ఆ త‌ర్వాత మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడ‌ని చెప్పుకొచ్చాడు. దీంతో ఇంటి స‌భ్యులు ఆ బాధ‌ని త‌ట్టుకోలేక తెగ ఏడ్చేశారు.

ఎపిసోడ్ 71 మొద‌ట్లో ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి గ‌ద్ద-కుందేలు ఆట ఆడించారు. ఇందులో ఒక‌రు గ‌ద్ద‌గా మారి కుందేలిని ప‌ట్టుకోవాలి. స‌ర‌దాగా సాగిన ఈ గేమ్‌లో సోహైల్ విన్న‌ర్‌గా నిల‌వ‌గా, అరియానా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆత‌ర్వాత వీరిద్దరిని రెండు టీమ్‌లుగా విడిపోయి స‌భ్యుల‌ని ఎంపిక చేసుకోవాల‌ని చెప్ప‌డంతో  సోహైల్ టీంలో అవినాష్‌, అఖిల్‌, హారిక  ఉన్నారు. అరియ‌నా టీంలో  మెహ‌బూబ్‌, లాస్య‌, అభిజిత్ ఉన్నారు. మోనాల్ సంచాల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించింది. 

సినిమా పేర్ల‌ని బొమ్మ‌ల రూపంలో డ్రా చేస్తే దాని పేరు గెస్ చేసే గేమ్‌లో భాగంగా సోహైల్ టీం ఎక్కువ పాయింట్స్ సాధించింది. గేమ్ మ‌ధ్య‌లో మోనాల్‌, అరియానా, హారిక‌ల‌ని సేవ్ చేశారు నాగార్జున. ఇద్ద‌రు స్నేహితులు చివ‌ర‌కి మిగ‌ల‌గా వారిద్ద‌రిలో ఎవ‌రు పోతార‌నే టెన్ష‌న్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది.చివ‌ర‌కు మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడ‌ని నాగ్ ప్ర‌క‌టించ‌డంతో హౌజ్ అంతా శోక‌సంద్రంలో మునిగిపోయారు. 

తాజావార్తలు


logo