మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 01, 2020 , 09:01:11

56 రోజుల జ‌ర్నీ.. త‌మ విల‌న్స్ ఎవ‌ర‌ని చెప్పిన హౌజ్‌మేట్స్

56 రోజుల జ‌ర్నీ.. త‌మ విల‌న్స్ ఎవ‌ర‌ని చెప్పిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్ర‌యాణం స‌క్సెస్ ఫుల్‌గా 56 రోజులు పూర్తి చేసుకుంది. 55వరోజు ఇంటి స‌భ్యుల జ‌ర్నీని వీడియో ద్వారా బిగ్ బాస్ చూపించ‌గా, అది చూసి ఫుల్ ఎమోష‌న‌ల్ అయ్యారు ఇంటి స‌భ్యులు. ఇక శనివారం రోజు ఈ 56 రోజుల జ‌ర్నీని బ‌ట్టి చూస్తే మీకు ఎవ‌రు విల‌న్ అనిపిస్తుందో చెప్పి వారిపై కిరీటం పెట్టాల‌ని నాగ్ అన‌డంతో అఖిల్ ముందుగా గేమ్ స్టార్ట్ చేశాడు. అఖిల్ విల‌న్ అభిజిత్ కాగా,  సోహైల్ విల‌న్ అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ విల‌న్ అభిజిత్‌,  హారిక విల‌న్ మెహబూబ్‌, ఇక మెహ‌బూబ్ విల‌న్ హారిక‌,  అవినాష్ విల‌న్ లాస్య‌, రివ‌ర్స్‌గా లాస్య విల‌న్ అవినాష్ , అరియానా విల‌న్ అఖిల్, మోనాల్ విల‌న్ లాస్య‌, అభిజిత్ విల‌న్ అమ్మా రాజ‌శేఖ‌ర్ అని చెప్పారు.

మోనాల్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన అభిజిత్‌కు నాగార్జున పంచ్ ఇచ్చారు. నీకు పులుల‌తో పాటు ఒంటె కూడా బాగా ఇష్టం అనుకుంటా అని అత‌నికి చుర‌క‌లు అంటించాడు.  అనంత‌రం నామినేష‌న్‌లో ఉన్న ఆరుగురిలో ఒక‌రిని సేవ్ చేసేందుకు పిల్లాడి బొమ్మ‌ని ఇచ్చి దానిని మార్చుకోవాలి అని చెప్పారు. ఏడుస్తున్న బొమ్మ ఎక్క‌డికి వ‌చ్చి ఆగితే వారు సేఫ్ అవుతార‌ని నాగ్ అన్నారు. అఖిల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే సరికి ఆ బొమ్మ న‌వ్వ‌డంతో అత‌ను సేఫ్ అయ్యాడు.  

ఇక అనారోగ్యంతో ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్లిన నోయ‌ల్‌ను బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఆహ్వానించారు నాగార్జున‌. అత‌ని ఆరోగ్యం ఇంకా సెట్ కాని కార‌ణంగా బిగ్ బాస్‌కు గుడ్‌పై చెప్పేశాడు. ఇలాంటి పరిస్థితుల‌లో ఇంట్లో ఉంటే క‌ష్ట‌మ‌ని భావించిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు అత‌నికి సెండాఫ్ ఇచ్చే కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. కాగా, గంగ‌వ్వ కూడా అనారోగ్యంతో హౌజ్ నుండి నిష్క్రమించిన సంగ‌తి తెలిసిందే


logo