మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 12, 2020 , 08:51:35

అఖిల్‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కు పంపిన హౌజ్‌మేట్స్

అఖిల్‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కు పంపిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ సీజన్ 4 కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. అర్ధ‌రాత్రి ఇంటి స‌భ్యుల‌ని నిద్ర‌లేపిన బిగ్ బాస్ అంద‌రిని బ్యాగులు స‌ర్ధుకోవాల‌ని చెప్పారు. అంద‌రు బ్యాగుల‌లో బ‌ట్ట‌లు పెట్టుకొని గార్డెన్ ఏరియాలోకి సూట్‌కేసుల‌తో వ‌చ్చారు. వీరికి బిగ్ బాస్ ఓ విష‌యం తెలిజయ‌జేశారు. మీ ప్ర‌యాణం మరింత ముందుకు సాగాలంటే ఇంటి స‌భ్యులు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌ల‌సి ఉంటుంది. కంటెస్టెంట్స్‌ని బ‌య‌ట‌కు పంపేది ప్రేక్ష‌కుల నిర్ణ‌య‌మే అయిన ఈ సారి మీకొక అవ‌కాశం దొరికింది దీని ప్ర‌కారం మీకు ఏ స‌భ్యుడు అయితే గ‌ట్టి పోటి ఇస్తాడ‌ని భావిస్తున్నారో ఆ స‌భ్యుడిని ఇంటి స‌భ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాల‌ని అన్నారు బిగ్ బాస్ .

దీంతో సోహైల్.. మెహ‌బూబ్ స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాడ‌ని చెప్ప‌గా, అరియానా .. అఖిల్ పేరు, అవినాష్‌.. అరియానా పేరు చెప్ప‌గా మిగ‌తా వారు త‌మ‌కు తామే స్ట్రాంగ్ అని చెప్పుకున్నారు. అభిజిత్ అయితే త‌న‌కే తానే స్ట్రాంగ్ అంటూ నాకు పోటీ ఎవ‌రు లేరు. ఒక‌రి పేరు చెప్ప‌మ‌న్నారు కాబ‌ట్టి అభిజీత్ అంటూ త‌న పేరు తానే చెప్పుకున్నాడు. నేను ఇక్కడకి గెలవాలని రాలేదు.. ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవడానికి వచ్చా. ఇక్క‌డికి వ‌చ్చాక ఎవ‌రెంటో అర్ధ‌మైంది త‌నకి తాను ఓ రేంజ్‌లో ఊహించుకున్నాడు. 

ఇక హౌజ్‌మేట్స్ అంద‌రు ఏకాభిప్రాయంతో అఖిల్‌ని హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంపేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ అఖిల్‌ని మెయిన్ డోర్ నుండి రావాల‌ని ఆదేశించారు. దీంతో క‌న్నీళ్ళు పెట్టుకుంటూ హౌజ్‌ని వీడారు. వెళ్ళే ముందు ఒక్కొక్క‌రి గురించి మాట్లాడాడు. ఆ త‌ర్వాత స్ట్రాంగ్ అని చెప్పి బ‌య‌ట‌కు పంపుతున్నంద‌కు ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల ఓట్లు ప‌డ‌లేదు. అందుకే బ‌య‌ట‌కు వెళ్లాను అంటే చాలా బాధ‌ప‌డే వాడిని అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు


logo