సోమవారం 25 జనవరి 2021
Cinema - Oct 19, 2020 , 08:37:42

ఫ‌న్ గేమ్స్‌తో సంద‌డి చేసిన హౌజ్‌మేట్స్

ఫ‌న్ గేమ్స్‌తో సంద‌డి చేసిన హౌజ్‌మేట్స్

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారంతో స‌క్సెస్‌ఫుల్‌గా ఆరువారాలు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా,  గంగ‌వ్వ అనారోగ్యంతో నిష్క్ర‌మించింది. ప్ర‌స్తుతం 12 మంది ఇంట్లో ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున స్టైలిష్ డ్రెస్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడుతూ.. అబ్బాయిలు బాగున్నారు అని మెచ్చుకున్నారు నాగార్జున‌.

సండే ఫ‌న్‌డే కావడంతో ఇంటి స‌భ్యుల‌తో ప‌లు గేమ్స్ ఆడించారు. ముందుగా ఇంటి స‌భ్యులు రెండు గ్రూపులుగా విడ‌గొట్టారు. గ్రూప్ ఏలో అఖిల్‌, సోహైల్‌, కుమార్ సాయి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి, హారిక ఉండ‌గా మిగ‌తా వారు టీమ్ బీలో ఉన్నారు. కెప్టెన్ నోయ‌ల్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. తొలి గేమ్‌లో దివి, అభిజిత్‌లు పాల్గొన‌గా వీరు డాట్స్‌తో బెలూన్స్ ప‌గ‌ల‌గొట్టాలి. మొద‌టి రౌండ్‌లో ఇద్ద‌రు సేమ్ ప‌గ‌ల‌గొట్ట‌గా, తర్వాత రౌండ్‌లో దివి మ‌రొక‌టి ప‌గుల‌గొట్టి విజేత‌గా నిలిచింది. 

ఈ సారి హారిక, మోనాల్‌తో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయించాడు నాగార్జున‌. హారిక‌, మోనాల్‌లో ఎవ‌రికి ఎక్కువ బ‌లం ఉంద‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఇందులో హారిక విజ‌యం సాధించింది. పిగ్గీ బ్యాగ్ రేసింగ్‌లో సోహైల్ హారిక‌ను ఎక్కించుకోగా, మెహ‌బూబ్ అరియానాను ఎత్తుకుని ప‌రిగెత్తాడు. ఈ ఆట‌లో మెహ‌బూబ్ రేసుగుర్రంలా ప‌రుగెత్తి విజేత‌గా నిలిచాడు. నాగార్జున కూడా అతనిని రేసుగుర్రం అంటూ అభినందించారు. బంతిని కింద కొట్టుకుంటూ వెళ్ళే గేమ్‌ని అభిజిత్‌, కుమార్ సాయిల‌తో ఆడించ‌గా కుమార్ గెలిచాడు.

ఇక బాస్కెట్ బాల్ గేమ్‌లో అఖిల్ క‌న్నా లాస్య ఎక్కువ బంతులు వేయ‌డంతో ఆమె గెలించింది.మొత్తానికి రెండు టీమ్‌లు పోటాపోటీగా గేమ్ ఆడ‌గా,  ఏ టీమ్ విన్న‌ర్‌గా నిలిచింది. ఇంట్రెస్టింగ్‌గా గేమ్ టాస్క్‌లు పూర్తైన త‌ర్వాత అఖిల్, దివి సేవ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జున‌. 


logo