మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 09:10:33

‌సండే ఫ‌న్‌డే అంటూ విచిత్ర గేమ్స్ ఆడించిన నాగ్

‌సండే ఫ‌న్‌డే అంటూ విచిత్ర గేమ్స్ ఆడించిన నాగ్

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారంతో 11 వారాలు స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ వారం హౌజ్ నుండి లాస్య బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌గా ప్ర‌స్తుతం ఏడుగురు స‌భ్యులు ఉన్నారు. వీరిలో టాప్ 5 ఎవ‌రు, టాప్ 2 ఎవ‌రు, విజేత‌గా ఎవ‌రు నిలుస్తారు అనే దానిపై కొద్ది రోజులుగా భిన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ చాలా ఫ‌న్‌గా సాగింది.  రాగానే నాగార్జున హారిక‌, అరియానాల‌ను రెండు టీమ్‌లుగా విడ‌గొట్టి గేమ్ ఆడించారు. అవినాష్‌, అరియానా, సోహైల్‌, మోనాల్ ఏ టీమ్‌లో ఉండ‌గా మిగిలిన‌వారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. 

ఈ టాస్క్‌లో ఫొటోల ఆధారంగా పాట‌ని క‌నిపెట్టి చెప్పాల్సి ఉంటుంది. హారిక టీం ఎక్కువ స‌మాధానాలు ఇవ్వ‌డంతో వారిని విజేత‌గా ప్ర‌క‌టించారు నాగ్. ఆ త‌ర్వాత లాస్య‌తో కాల్ మాట్లాడించ‌గా, ఆ అభిమాని మీరు సేఫ్ గేమ్ ఆడుతున్న‌ట్టు అనిపిస్తుంద‌ని పేర్కొంది. దీనికి స్పందించిన లాస్య నేను బ‌య‌ట కూడ ఇలానే ఉంటాను. న‌న్ను మీరు తప్పుగా అర్దం చేసుకున్నారు అని క్లారిటీ ఇచ్చుకుంది

 ఇక గార్డెన్ ఏరియాలో మ‌రో గేమ్ ఆడించారు నాగ్. డైస్ రోల్ చేస్తూ.. బాక్స్‌లు దాటాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ల స‌మ‌యంలో అవినాష్ గోర్ల‌కు నోటితో నెయిల్ పాలిష్ వేయ‌డం చేశాడు సోహైల్. ఇంత బాగా వేస్తున్నావు సోహైల్ అంటూ ప్ర‌శంసిస్తూనే రాత్రి 9 త‌ర్వాత ఇదే ప‌నా అంటూ ఆట‌ప‌ట్టించాడు. ఇక అవినాష్ చీర క‌ట్టుకొని క్యాట్ వాక్ చేయ‌డం , డ్యాన్స్ చేయ‌డం వంటివి చేశాడు. దీనికి నాగ్ రాత్రి 9 త‌ర్వాత నీకు ఈ ప‌ని అనుకుంటా అంటూ జోక్ చేశాడు. ఇక అఖిల్ సాంగ్‌ని  రొమాంటిక్ సాంగ్‌ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, స్లో మోష‌న్‌లో బాగా పాడాడు. ఇక‌ లాస్య నాలుక బ‌య‌ట‌పెట్టి డైలాగులు చెప్పి వినోదాన్ని పంచింది


logo