గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 08:51:47

దెయ్యాల రూంలో హౌజ్‌మేట్స్ తిప్ప‌లు

దెయ్యాల రూంలో హౌజ్‌మేట్స్ తిప్ప‌లు

బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్‌ఫుల్‌గా 85 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. సండే రోజు ఎపిసోడ్ అంతా చాలా ఫ‌న్‌గా సాగింది. కిచ్చా సుదీప్ గెస్ట్‌గా రావ‌డంతో ఈ కార్య‌క్ర‌మం మ‌రింత స్పెష‌ల్‌గా మారింది. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలోని పాట‌తో ఎంట్రీ ఇచ్చిన నాగ్ హౌజ్‌మేట్స్‌కు హాయ్ చెప్పారు. వారు త‌మ డ్యాన్స్‌ల‌తో కింగ్‌ని ఎంట‌ర్‌టైన్ చేశారు. అవినాష్ -అరియానా, అభిజిత్ -మోనాల్, సోహైల్ -హారిక జంట‌లుగా డ్యాన్స్‌లు చేసి ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు. నాగ్ కూడా వీరి డ్యాన్స్ చూసి మురిసిపోయాడు. ఇక 12 వారం బిగ్ బాస్ హౌజ్ మొత్తం దెయ్యం కొంప‌గా మార‌గా, సండే రోజు చీక‌టిలో ధైర్యం స్థైర్యం' టాస్క్ ఆడించారు నాగ్.

ఇంత‌క‌ముందు దెయ్యాల గ‌దికి జంట‌గా వెళ్ళిన కంటెస్టెంట్స్ ఇప్పుడు ఒక్కొక్క‌ళ్ళుగా వెళ్ళాలి అని నాగ్ చెప్ప‌డంతో ముందుగా  సోహైల్ వెళ్ళాడు. అరియానా నా గుండె ఆగిపోతుంది అని చెప్ప‌డంతో సోహైల్ ని పంపిన నాగ్ అందులో ప్రాప‌ర్టీస్ ఏంటో చెప్పాల‌ని అన్నాడు. చీక‌టి గ‌దిలో వ‌ణికిపోయిన సోహైల్ మొత్తానికి టాస్క్ ట్రై చేశాడు. ఇక త‌ర్వాత వెళ్ళిన అఖిల్ కూడా భ‌య‌ప‌డుకుంటూనే టాస్క్ పూర్తి చేశాడు . సోహైల్‌, అఖిల్‌ల కంటే అభిజీత్ కాస్త బెట‌ర్ అనిపించాడు. ఎక్క‌డ బెద‌ర‌కుండా టాస్క్ పూర్త చేశాడు. ఇక మోనాల్‌, హారిక అయితే అస‌లు ఏదో అలా క్యాజువ‌ల్‌గా వెళ్ళి క్యాజువ‌ల్‌గా వచ్చారు. ఇక వీరందరిని చూసి ధైర్యం తెచ్చుకున్న అరియానా కూడా డేర్‌గా లోప‌లికి వెళ్లి టాస్క్ పూర్తి చేసింది.

బిగ్ బాస్ ఇచ్చిన దెయ్యం టాస్క్‌లో సోహైల్‌, అఖిల్‌లు జంట‌గా వెళ్ళి లోప‌లు రెండు స్పూన్‌ల‌ని ప‌ట్టుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్పుడు లోప‌ల అరుపుల‌కు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు.బ‌య‌ట మాత్రం చాలా బిల్డ‌ప్ ఇచ్చారు. కెమెరా ముందుకు వ‌చ్చి బిగ్ బాస్ ఈ వీడియోని ప్లే చేయోద్ద‌ని కూడా వేడుకున్నారు. కాని అదంతా ఆదివారం ఎపిసోడ్‌లో ఓ సినిమాగా చూపించారు. అది చూసి ప్ర‌తి ఒక్క‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు


logo