మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 13, 2020 , 09:47:46

చ‌చ్చి బ్ర‌తికాన‌న్న అరియానా.. నకిలీ పేరెంట్స్‌ని సెట్ చేశాన‌న్న సోహైల్

చ‌చ్చి బ్ర‌తికాన‌న్న అరియానా.. నకిలీ పేరెంట్స్‌ని సెట్ చేశాన‌న్న సోహైల్

ఫ్యామిలీ పంపిన లెట‌ర్ కోసం ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన విష‌యాలు చెప్పుకొచ్చారు ఇంటి స‌భ్యులు. ఇందులో భాగంగా అరియానా త‌న జీవితంలో జ‌రిగిన మేజ‌ర్ కార్ యాక్సిడెంట్ గురించి వివ‌రించింది. గ‌త ఏడాది జూలై  13న నా ఫ్రెండ్స్ అంద‌రం కారులో ఊరుకి బ‌య‌లు దేరాం. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి సడెన్‌గా వ‌చ్చే స‌రికి కారు కిలో మీట‌రు దూరం వ‌ర‌కు వెళ్లి  ఎల‌క్ట్రిక్ పోల్‌ని గుద్దుకొని ఆగింది. కారులో నుండి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి, బ‌య‌ట క‌రెంట్ వైర్స్ ఉన్నాయి. చ‌నిపోయాం అనే అనుకున్నాం అని అరియానా చెప్పుకొచ్చింది. ఇది అఖిల్‌కి సీక్రెట్‌లా అనిపించ‌కపోవ‌డంతో చింపిన లెట‌ర్‌ని ఆమెకు పంపాడు 

ఇక మోనాల్‌.. త‌న చదువుని త్యాగం చేసిన విష‌యాన్ని వివ‌రించింది. ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్త‌య్యాక బ్యాంక్ లో జాబ్ వ‌చ్చింది. జాబ్, కాలేజ్ టైమింగ్ సెట్ కాలేదు. దీంతో ఫైన‌ల్ ఇయ‌ర్ డ్రాన్ అయ్యాను. నా ఫ్యామిలీల కోసం నా చ‌దువుని త్యాగం చేశా ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌దు అని మోనాల్ చెప్పింది. ఈమె రీజన్‌కు సాటిస్ఫై అయిన అఖిల్ .. మోనాల్ కు లేఖ పంపాడు. ఇది చ‌దువుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.  

ఇక చివ‌రిగా సోహైల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబడ్డ విష‌యం చెప్పాడు. ఓ సారి ప‌బ్ నుండి ఇంటికి వెళుతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాను. 102 రీడింగ్ చూపించింది. కారు తీసుకెళ్ళారు. చ‌లానా క‌ట్టి కోర్టు స్లాట్ తీసుకోమ‌న్నారు పోలీసులు. త‌ల్లిదండ్రుల‌ని తీసుకురమ్మ‌న్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్‌తో చెప్పి డూప్లికేట్ పేరెంట్స్‌ని మాట్లాడా. కోర్టుకు వెళ్లాక ప్ర‌తి ఒక్క‌డూ ప‌దో త‌ర‌గ‌తి రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్టు నీ రీడింగ్ ఎంత అని అడుగుతూనే ఉన్నారు. ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌దు అని సోహైల్ అన్నాడు.  ఇతనికి లేఖ పంపాడు అఖిల్. అయితే ఆ లేఖ‌లో అఖిల్, మెహ‌బూబ్‌ల పేర్లు ండ‌డంతో చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు సోహైల్. ఈ టైంలో అఖిల్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల‌య్యే వాడంటూ క‌న్నీరు పెట్టుకున్నాడు . ఇక అఖిల్ త‌న‌కు లేఖ‌ని పంపించాల‌ని బిగ్ బాస్  ద‌గ్గ‌ర మొర పెట్టుకున్నాడు. మ‌రి అత‌నికి డైరెక్ట్‌గా లేఖ పంపారా ఏద‌న్నా ట్విస్ట్ ఇచ్చారా అన్న‌ది నేటి ఎపిసోడ్ లో తేల‌నుంది.


logo