బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 09:25:46

పోటీ పడి మ‌రీ పూలు ఏరుకున్న హౌజ్‌మేట్స్

పోటీ పడి మ‌రీ పూలు ఏరుకున్న హౌజ్‌మేట్స్

బుధ‌వారం రోజు ఇంటి స‌భ్యుల‌లో ఒక‌రు డైరెక్ట్‌గా ఫినాలే రేసుకు వెళ్లేందుకు రెండో లెవ‌ల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే మెడల్ ద‌క్కించుకునేందుకు గాను  పై నుంచి ప‌డే పూల‌ను సేక‌రించి మ‌ట్టిలో నాటాలి. ఎవ‌రైతే ఎక్కువ పూలు నాటుతారో అందులో చివ‌రి ఇద్ద‌రి త‌ర్వాతి లెవ‌ల్‌కు అర్హ‌త సాధిస్తారు అని చెప్పాను బిగ్ బాస్. ముందు రోజు టాస్క్‌లో అవినాష్‌, అరియానా,మోనాల్ ఔట్ కావ‌డంతో బుధ‌వారం ఎపిసోడ్‌లో అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక ఎవ‌రికి వారే సాటి అన్న‌ట్టు పూలు ప‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశారు.

ఓ ద‌శ‌లో హారిక‌.. సోహైల్ చేతిలో ఉన్న పూలు లాక్కోవ‌డంతో రెచ్చిపోయిన సోహైల్ ఆమె ద‌గ్గ‌ర ఉన్న మొత్తం పూలు లాక్కున్నాడు. ముందే మ‌నం మాట్లాడుకున్నాం, అయిన నువ్వు నా చేతిలో నుండి లాక్కున్నావు క‌దా స‌రే కానివ్వు అంటూ రెచ్చిపోయాడు సోహైల్‌. దీంతో హారిక ఎమోష‌న‌ల్ అయింది. లాక్కోవ‌ద్దు అంటే ఎలా గెలుస్తాం, అది చేయోద్దు ఇది చేయోద్దు అంటే గెల‌వ‌డం ఎలా కుదురుతుంది అని త‌న బాధ‌ను చెప్పుకుంది. అయితే కొద్ది సేపు జ‌రిగిన ఈ గొడ‌వ త‌ర్వాత సోహైల్ ..హారిక ద‌గ్గ‌ర తీసుకున్న పూలు తిరిగి ఇచ్చాడు. ఆమెని కూల్ చేశాడు. అయితే బ‌జ‌ర్ మోగే స‌మ‌యానికి హారిక ద‌గ్గ‌ర త‌క్కువ పూలు ఉండ‌డంతో ఆమె నిష్క్ర‌మించింది


logo