గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 09:57:14

బిగ్ బాస్ హౌజ్‌లో దెయ్యం లొల్లి.. భ‌య‌ప‌డేది లేద‌న్న హౌజ్‌మేట్స్‌

బిగ్ బాస్ హౌజ్‌లో దెయ్యం లొల్లి.. భ‌య‌ప‌డేది లేద‌న్న హౌజ్‌మేట్స్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బుధ‌వారం ఎపిసోడ్‌లో అరియానాకు దెయ్యం క‌నిపించ‌డంతో చిన్న పిల్ల‌లా ఏడ‌వ‌డం మొద‌లు పెట్టింది. హారిక దెయ్యానికి స‌వాల్ విసిరింది. అవినాష్ నీకు పెళ్లి కాక‌పోతే నేను చేసుకుంటాన‌ని జోకులు చేశాడు. దెయ్యంలా మాట్లాడేది ఆర్‌జే సునీత్ అని కొద్ది సేపు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌గా, చంద్రముఖి స్పూఫ్‌తో ఇటు ప్రేక్ష‌కుల‌ని అటు కంటెస్టెంట్స్‌ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు అవినాష్‌. అయితే త‌న పేరు జ‌ల‌జ అని , మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కి గురి చేస్తాన‌ని చెప్పుకొచ్చింది ఆ దెయ్యం.

బిగ్ బాస్ ఇంటి నియ‌మాలు ఉల్లంఘిస్తే నాకు అస్స‌లు న‌చ్చ‌దు. ఈ రోజు రాత్రి నుండి నేను చెప్పిన‌ట్టు చేయాలి. నేనేంటో మీకు చూపిస్తానంటూ ఒక్కో ఇంటి స‌భ్యుడికి టాస్క్‌లు ఇచ్చింది.   సోహైల్‌ను డ్యాన్స్ చేయాల‌ని, అభిజిత్‌ను ఆకులు లెక్క‌పెట్టాలంటూ విచిత్ర టాస్క్‌లు ఇచ్చింది. దీనికి ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ త‌ప్ప ఎవ‌రు చెప్పిన మేం చేయం అంటూ మొండికేసి కూర్చున్నారు. ఇంత‌లో ఓ లెట‌ర్ రాగా, దానిని కూడా వాళ్లు లైట్ తీసుకున్నారు. చివ‌రిలో బిగ్ బాస్ అని లేదు అంటూ త‌ప్పించుకున్నారు.


logo