ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 09:17:04

క‌ష్టాల‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్న‌ హౌజ్‌మేట్స్

క‌ష్టాల‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్న‌ హౌజ్‌మేట్స్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో రోజురోజుకి మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. 40వ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు తాము ఈ స్థాయిలో ఉండ‌డానికి ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో వివ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎన్నో విషాద సంఘ‌ట‌న‌లు ఉండ‌గా, వాటిని విన్న ప్రేక్ష‌కులు కూడా కాస్త ఎమోష‌న‌ల్ అయ్యారు. ముందు అరియాన త‌న లైఫ్ హిస్ట‌రీ గురించి చెప్పుకొచ్చింది. ఇది ఎప్పుడు ఎవ‌రికి చెప్ప‌లేద‌ని మొద‌టి సారిగా చెబుతున్నాంటూ స్ప‌ష్టం చేసింది.

నా అస‌లు పేరు అర్చ‌న‌. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. చెల్లి క‌డుపులో ఉన్న స‌మ‌యంలో వారు విడిపోయారు. అమ్మ  గ‌వ‌ర్న‌మెంట్ న‌ర్స్ గా ప‌ని చేసేది. గ‌వ‌ర్న్‌మెంట్ జాబ్ కాబ‌ట్టి నా చెల్లికి, నాకు ఏ లోటు రాకుండా చూసింది. మేమిద్ద‌రం మా అమ్మ‌కు రెండు క‌ళ్లు అని చెప్పేది. మా కోసం అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. మాకు రిలేటివ్స్ కూడా త‌క్కువ‌గానే ఉండే వాళ్ళు. నేను యాంక‌రింగ్ చేస్తానంటే అమ్మ మొద‌ట ఒప్పుకోలేదు. త‌ర్వాత క‌న్విన్స్  చేసి యాంక‌రింగ్‌కు వెళ్ళాను. రూ.500కు కూడా ఈవెంట్స్ చేశాను. డిగ్రీ కూడా లేక‌పోవ‌డంతో యాంక‌రింగ్ వృత్తినే న‌మ్ముకున్నా. ఇప్పుడు ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాను. అప్పుడు  ఆ స్టెప్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా.. నా ఫస్ట్ లవ్ మిస్ అయ్యా.. కాని నన్ను నేను చూసికుని గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ త‌న సీక్రెట్స్ చెప్పుకొచ్చింది అరియానా.

ఇక మోనాల్ త‌న తండ్రి చ‌నిపోయిన విష‌యాన్ని త‌ల‌చుకొని ఎమోష‌న‌ల్ అయింది. నా కోసం నా ఫ్యామిలీ చాలా క‌ష్ట‌ప‌డింది. వారి కోసం ఏం చేయ‌డానికైన సిద్ధ‌మే అంటూ మెహ‌బూబ్ క‌న్నీరు పెట్టుకున్నాడు. హారిక త‌న అమ్మ‌మ్మ ఇంటికి వెళ్లిన‌ప్పుడు కాస్త ఇబ్బంది ప‌డ్డ‌ట్టు చెప్ప‌గా,  త‌ర్వాత త‌న త‌ల్లి మ‌ళ్ళీ త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లింది అంటూ ఎమోష‌న‌ల్ అయింది.  అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడు, అత‌డు నా వెన్నెముక అంటూ క‌న్నీరు పెట్టుకుంది. ఇంట‌ర్మీడియెట్‌లో త‌న త‌ల్లి దండ్రులు విడిపోగా, ఐదు సంవ‌త్స‌రాల నుండి నాన్న‌కు దూరంగా ఉన్నాను. మ‌ళ్లీ ఆయ‌న గుర్తు కూడా రాలేద‌ని చెప్పుకొచ్చింది హారిక‌.

ఇక సోహైల్ త‌న తండ్రి సింగ‌రేణి ఉద్యోగి అని చెబుతూ ఓ రోజు అండ‌ర్‌గ్రౌండ్‌లో త‌న తండ్రి త‌ల‌పై రాయి ప‌డ్డ విష‌యాన్ని చెప్పాడు. వ‌య‌స్సు మీద ప‌డ‌డంతో ప్ర‌భావం బ‌య‌ట ప‌డింది. ఓ కిడ్నీ లేక‌పోయిన కూడా ఉద్యోగం చేస్తూ  మా నాన్న ఐదుగురిని పెంచి పోషించాడు . నాన్నంటే నాకు చాలా ఇష్టం.‌ సింగ‌రేణి ముద్దుబిడ్డ స‌య్య‌ద్ సోహైల్ బిగ్‌బాస్‌కు వ‌చ్చిండ‌ని మా నాన్న హ్యాపీగా ఫీల‌వుతాడు అని సోహైల్ పేర్కొన్నాడు.

ఇక నోయ‌ల్ త‌న బాధ‌ను చెబుతూ.. అమ్మ అంద‌రి ఇళ్ళ‌ల్లో ప‌ని చేసేది. నాన్న‌తో నేను థియేట‌ర్‌కు వెళ‌తా. చిరంజీవి ఫ్యాన్ అయిన నేను తొలిసారి ఈగ సినిమాలో క‌నిపించాను. అంద‌రూ నాతో ఫొటోలు దిగుతుంటే నాన్న షాక‌య్యారు. కానీ త‌ర్వాత నాన్న‌తో నేను సెల్ఫీ దిగాను అని నోయ‌ల్ చెప్పాడు. ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్.. త‌న త‌ల్లితో ఉన్న బాండింగ్ గురించి చెప్పాడు. నా అమ్మ ఆస్తినంతా నాకిచ్చింది. దీంతో అంద‌రు అమ్మ‌ను దూరంగా ఉంచారు. ఓ సారి అమ్మ  అనారోగ్యానికి గురి కాగా, ఆసుప‌త్రికి తీసుకెళ్ళాను. బ‌త‌కడం క‌ష్టం ఇక తీసుకెళ్లండి అని అన్నారు. అప్పుడు వ‌ర్షం చాలా ప‌డుతుండ‌డంతో అమ్మ‌కి అడ్డంగా నిలుచొని చిన్న ఆసుప‌త్రిలో ఉంచాం. రెండేళ్ళ‌పాటు అమ్మ‌ను కాపాడుకున్నాం. డ‌బ్బు ఎప్పుడైన వ‌స్తుంది కాని కుటుంబ స‌భ్యుల‌తో మంచి రిలేష‌న్స్ మెయింటైన్ చేయ‌డం చాలా ముఖ్యం అంటూ మాస్టార్ తెలిపారు. అభి, అఖిల్, దివి‌లు కూడా చిన్న‌నాటి విష‌యాలు గుర్తు చేసుకున్నారు. దివి త‌న ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నానంటూ పేర్కొంది.


logo