మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 26, 2020 , 08:47:32

ఫ్యామిలీ వీడియోలు చూపించిన సామ్.. ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

ఫ్యామిలీ వీడియోలు చూపించిన సామ్.. ఎమోష‌న‌ల్ అయిన హౌజ్‌మేట్స్

దాదాపు 50 రోజుల నుండి ఇంట్లో వాళ్ళ‌కు దూరంగా ఉంటూ నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉంటున్న హౌజ్‌మేట్స్‌కు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా వాళ్ళ వాళ్ల ఫ్యామిలీ వీడియోల‌ను చూపించింది స‌మంత‌. ముందుగా అఖిల్ త‌న ఫ్యామిలీ వీడియో చూసి ఎమోన‌ష‌న‌ల్ కాగా, ఆ త‌ర్వాతి అవ‌కాశాన్ని మోనాల్‌కు ఇచ్చాడు. ఆమె త‌ల్లి మాట్లాడుతున్న వీడియో చూసి మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది.  త‌ర్వాత నోయ‌ల్ వంతు రాగా, ఆయ‌న త‌మ్ముడు మాట్లాడిన వీడియోని చూసి సంతోషించాడు.  ఒక‌రిని సేవ్ చేసే స‌మ‌యం వ‌చ్చింద‌ని చెప్పిన సామ్ .. అరియానా సేవ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించింది. 

స్వయంవ‌రంలో రెండో టాస్క్ ఎవ‌డు పోటుగాడుతో మొద‌లైంది. ఇందులో అబ్బాయిలు.. అమ్మాయిలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ రౌండ్‌లోను అఖిల్ గెల‌వ‌గా, ఒక్క పాయింట్ రాని సోహైల్ త‌ప్పుకున్నాడు.  అయితే సోహైల్‌కు త‌న ఫ్యామిలీ వీడియో చూపించ‌గా, అందులో సోహైల్ త‌మ్ముళ్లు, తండ్రి ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు.  నాకు బాగోలేన‌ప్పుడు మెహ‌బూబ్‌, అఖిల్ బాగా చూసుకుంటూ, తినిపించార‌ని సంతోషం వ్య‌క్తం చేశాడు. 

అమ్మ రాజ‌శేఖ‌ర్ కు కూడా త‌న ఫ్యామిలీ వీడియో చూపించ‌గా, ఇందులో ఆయ‌న భార్య మాట్లాడుతూ.. చాలా బాగా ఆడుతున్నావ్‌, దెబ్బ‌లు త‌గిలించుకోకు, గుండు బాగుంది అని చెప్పింది. మిగ‌తావాళ్ల‌కు ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నావ్, మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతున్నాం" అని కొడుకు, కూతురు మాట్లాడిన వీడియో చూసి భావోద్వేగానికి లోన‌య్యారు. దివి త‌ల్లిదండ్రుల వీడియో కూడా ప్లే చేయ‌గా వాళ్ల అమ్మనాన్న‌ల‌ని చూసి దివి కూడా ఎమోష‌న‌ల్ అయింది.  


logo