మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 07:41:36

రోట్లో పిండి రుబ్బించి దోసెలు వేయించిన బిగ్ బాస్‌

రోట్లో పిండి రుబ్బించి దోసెలు వేయించిన బిగ్ బాస్‌

బిగ్ బాస్ హౌజ్‌లో ఊహించ‌ని ట్విస్ట్‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. అమీతుమీ టాస్క్‌లో ఇచ్చిన అర్ధ‌శిరోముండ‌నం డీల్‌ని ఎవ‌రు ఒప్పుకోక‌పోవ‌డంతో అంత‌టితో ముగిసింద‌ని అంద‌రు భావించ‌గా, మ‌ళ్ళీ నాగార్జున ఆ డీల్‌ని తీసుకొచ్చి కంటెస్టెంట్స్ ముందు పెట్టాడు. ఈ డీల్ ఒప్పుకుంటే వ‌చ్చేవారం నామినేష‌న్ నుండి సేవ్ కావొచ్చు లేదంటే మ‌రో వ్య‌క్తిని సేవ్ చేయోచ్చు అనే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే స‌రికి  మాస్ట‌ర్ హాఫ్ షేవ్ (అరగుండు, అరగడ్డం) చేయించుకున్నాడు.

శ‌నివారం రోజు నాగార్జున మైండ్ బ్లాక్ అనే  సాంగ్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ముందు రోజు హౌజ్‌లో ఏం జ‌రిగిందో చూపించారు. రాజ‌శేఖ‌ర్ కొద్ది సేపు అరియానాతో ఎలిమినేష‌న్ గురించి చ‌ర్చించారు. ఆ త‌ర్వాత అవినా్‌ష‌తో  టాస్క్‌ల గురించి మాట్లాడాడు, ఇక కొద్ది సేప‌టి త‌ర్వాత నోయ‌ల్‌తో ప‌లు విష‌యాల గురించి డిస్క‌స్ చేశాడు.  

అనంతరం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి స‌భ్యుల‌ను రెండు గ్రూపులుగా స‌ప‌రేట్ చేసి ఎవ‌రైతే రోట్లో ప‌ప్పు రుబ్బి ఎక్కువ దోసెలు వేస్తారో వారు విజేత‌గా నిలుస్తారని అన్నారు. దీంతో పోటీలోకి దిగిన   అమ్మా రాజశేఖర్ టీం 15 దోసెలు.. లాస్య టీం 12 దోసెలు వేయడంతో మాస్టర్ టీం విన్ అయ్యింది. అయితే ఈ టాస్క్‌లో ఆపోజిట్ టీంలో ఉన్న సోహైల్ ..మాస్ట‌ర్ వేసిన దోసెల బౌల్‌ని ప‌ట్టుకున్నాడు. దీంతో సోహైల్‌ని దొంగ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. నోయ‌ల్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.

దొంగ అని నా క్యారెక్ట‌ర్‌ని మాస్ట‌ర్‌ ఎలా డిసైడ్ చేస్తాడంటూ ఈ విష‌యం గురించి  నోయ‌ల్‌, అఖిల్‌తో చ‌ర్చించాడు సోహైల్. రాజ‌శేఖ‌ర్ ని కూడా ఇదే విష‌యంపై ప్ర‌శ్నించాడు ‌.  . ఇలాంటి మైండ్ సెట్‌లతో నేను ఆడలేకపోతున్నా.. యాక్షన్‌కి రియాక్షన్ ఇస్తే పర్లేదు.. కానీ క్యారెక్టర్‌ గురించి చెడ్డగా మాట్లాడితే నాకు నచ్చడం లేదు’ అంటూ అఖిల్ దగ్గర తెగ బాధపడ్డాడు సోహైల్. అయితే రాజ‌శేఖ‌ర్‌ని పిలిచి అఖిల్ ఇలా అన‌కూడదు మాస్టార్ అన‌డంతో వాడు మ‌రి అలా చేయోద్దు క‌దా. ఇంకోసారి వాడు ఇలాంటివి చేయోద్దు, నేను అన‌నంటూ ఇష్యూకి ముగింపు ప‌లికాడు.

ఇక ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడిన నాగార్జున ముందుగా ఇంటి కెప్టెన్ అయిన నోయ‌ల్‌కు క్లాస్ పీకారు.  రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌లో ఎందుకు డ్రాప్ అయ్యావ్. నువ్వు చేయ‌కుండా అవినాష్‌ని ఆడించావు. ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు నీ ఆట నువ్వు ఆడు. ప‌క్క వాళ్ళ గురించి ప‌ట్టించుకోవ‌ద్దు. రియల్ నోయల్‌ని బయటకు తీసుకురా అని సలహా ఇచ్చాడు నాగ్‌. ఆ త‌ర్వాత  గ‌త వారం మొత్తం త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆట‌న ఆడిన సోహైల్‌ని అభినందించాడు. ఎవ‌రో కామెడీ పీస్ (అవినాష్) అంటే నువ్వు ఎందుకు ఫీల‌వుతున్నావు, ఏడ‌వ‌కు అలా అంటూ ఆయ‌న‌కు ధైర్యం చెప్పారు.  సోహైల్‌పై అరియానా కూడా అర‌వ‌డంతో ఆమెకు కొంత క్లాస్ పీకారు నాగార్జున‌. అత‌నికి సారీ చెప్పాల‌ని అనిపించ‌ట్లేదా అని అరియానాని నాగ్ ప్ర‌శ్నించ‌గా, మేమిద్ద‌రం ఫ్రెండ్స్ బ‌ట్ సారీ అయితే చెప్ప‌ను సర్ అంది. ఫ్రెండ్ కాబ‌ట్టే సారీ చెప్పి వివాదానికి పులిస్టాప్ పెట్టొచ్చు అని నాగ్ అన‌డంతో క్ష‌మాప‌ణ‌లు కోరింది అరియానా.  

మోస్ట్ ఎంటరైనింగ్ పర్సన్ ఆఫ్ ది హౌస్ అనే  బిరుదుని అవినాష్‌కు ఇచ్చిన నాగార్జున‌.. నువ్వు సీరియ‌స్‌లోను కామెడీ చేస్తావు అని అన్నారు. నువ్వు అంత‌లా అర‌వాల్సి ఎందుకు వ‌చ్చింద‌ని నాగార్జున ప్ర‌శ్న‌గా, అవినాష్ మాట్లాడుతూ.. సంచాల‌కుడు డెసిష‌న్ స‌రిగా లేద‌ని అన్నారు. దీంతో నాగ్ నువ్వు అలా అర‌వాల్సిన అవ‌స‌రం లేదు. సంచాల‌కుడి నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని చెప్పారు.  ఇక మోనాల్ గత వారం నుండి ఒకే డ్రెస్‌లో ఉండ‌గా, ఆమెకు విముక్తి క‌ల్పించేందుకు ఎవ‌రు సాహ‌సం చేస్తారు అని నాగ్ అడిగారు. దీంతో అరియానా ,అవినాష్‌లు ముందుకు వ‌చ్చారు. అవినాష్ మేం నిన్ను చూడ‌లేం కాని, అరియానా నువ్వు ఆ ఛార్జ్ తీసుకో అని చెప్పారు నాగార్జున‌.


logo