బిగ్ బాస్‌లో పెరిగిన వేడి.. అమ్మ రాజశేఖర్, అభిజీత్ ఓవరాక్షన్

బిగ్ బాస్ 4 తెలుగు మొదలై ఇప్పటికే 8 వారాలు పూర్తైపోయాయి. దాదాపు సగం మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పటి వరకు సేఫ్ గేమ్స్ ఆడారు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు. తమకు కావాల్సిన వాళ్ల కోసం కెప్టెన్సీ పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. ఇలా ఈ 8 వారాల్లో ఎన్నో చూసారు ఆడియన్స్. అయితే ఇప్పుడు అదంతా కాదు.. అసలైన గేమ్ ఆడండి అంటూ బిగ్ బాస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటి నుంచి మీరు మీ కోసమే ఆడండి.. పక్కవాళ్ల కోసం కాదంటూ పెద్దాయన కాస్త గట్టిగా చెప్పేసాడు. దాంతో అసలైన ఆట మొదలైంది.. అందుకే అసలైన గొడవలు కూడా బయటికి వచ్చేసాయి. అప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్లే నామినేట్ చేసుకున్నారు. నువ్వెవడు అంటూ నువ్వెవడు అంటూ తిట్టి పోసుకున్నారు. 9వ వారం నామినేషన్స్ చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఆ ప్రోమో విడుదలైన తర్వాత ఇంట్లో ఎంత వేడి ఉందో అర్థమైపోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అమ్మ రాజశేఖర్, అభిజీత్ కొట్టుకుంటారేమో అనేంతగా రెచ్చిపోయారు.
ఏంట్రా చూస్తున్నావ్ అంటూ అరిచేస్తున్నాడు అమ్మ. మరోవైపు అభి కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. అమ్మను బయటికి పంపినట్లే పంపి సేవ్ చేయడంతో తన గురించి ఇంట్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిసిపోయింది. దాంతో అదే మనసులో పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అమ్మ. అక్కడ్నుంచే మొదలైన గొడవలో అభిజీత్‌ను టార్గెట్ చేసాడు. నువ్వెవడ్రా అంటూ కాస్త డోస్ కూడా పెంచేసాడు అమ్మ రాజశేఖర్. ఈ సారి నామినేట్ చేయాలనుకున్న వాళ్ల తలపై గుడ్లు కొట్టాలి. అలా అభిజీత్, అమ్మపై బాగానే గుడ్లు పగిలాయి. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా అఖిల్ వెళ్లి మోనాల్‌ను నామినేట్ చేసాడు. దాంతో ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు. అయితే దీని వెనక ఓ కారణంగా ఉంది.
తనకు సోహైల్ మధ్య మనస్పర్థలు రావడానికి కారణం మోనాల్ అని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు అఖిల్. ఇదే క్రమంలో సోహైల్ కూడా మోనాల్‌ను తిట్టేసాడు. నీకేదైనా చెప్తే వెంటనే వెళ్లి ఊదేస్తావా అంటూ సీరియస్ అయ్యాడు. మరోవైపు సోహైల్‌ను నామినేట్ చేసిన తర్వాత అరియానాపై అరిచేసాడు ఈయన. ఇంకా నీ దగ్గర ఎక్స్ ట్రా గుడ్లు ఉంటే తీసుకొచ్చి పగలగొట్టు అంటూ సెటైర్ వేసాడు. హారిక, అవినాష్ ఈ సారి నామినేషన్స్‌లో రచ్చ చేసారు. నోయల్ కోసం హారిక స్టాండ్ తీసుకుంది. అభిజీత్, అవినాష్ కూడా గొడవపడ్డారు.. దాంతో నేను కమెడియన్.. నేను ఎంటర్టైనర్ అంటూ అవినాష్ గట్టిగా అరుస్తుంటే.. ఈయన కోసం చప్పట్లు కొట్టండి అంటూ అభిజీత్ సెటైర్లు వేసాడు. ఎలా చూసుకున్నా కూడా ఈ వారం నామినేషన్స్ చాలా హాట్‌గా ఉన్నాయి. వాళ్లను అలాగే వదిలేస్తే ఆ గుడ్లు వేడికి ఆమ్లెట్స్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాయి.
Asalaina aata modalu...Nomination process started #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/pfJSHH782w
— starmaa (@StarMaa) November 2, 2020
తాజావార్తలు
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్‌తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు
- జాన్వీకపూర్ కు 'వర్క్ ఫ్రమ్ హోం ' నచ్చలేదా..?
- గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు