సోమవారం 25 జనవరి 2021
Cinema - Nov 17, 2020 , 08:51:23

అఖిల్‌, అభిజీత్‌ల మ‌ధ్య మాటల యుద్ధం.. హీటెక్కిన హౌజ్

అఖిల్‌, అభిజీత్‌ల మ‌ధ్య మాటల యుద్ధం.. హీటెక్కిన హౌజ్

సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ర‌చ్చ షురూ అయిత‌ది. గొడ‌వ‌లు, వాగ్వాదాలు , అల్ల‌ర్ల‌తో బిగ్ బాస్ హౌజ్ వేడెక్కిపోత‌ది.  72వ ఎపిసోడ్ కూడా చాలా హాట్ హాట్‌గా సాగింది. ఎపిసోడ్ మొద‌ట్లో వారికి వ‌చ్చిన మ‌ట‌న్ చూసి అంద‌రు ఎగిరి గంతేశారు ఇంటి స‌భ్యులు. ఇక ఆ త‌ర్వాత నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు కావ‌డంతో అంద‌రు గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. అఖిల్ కెప్టెన్ కావ‌డంతో అత‌నిని ఎవ‌రు నామినేట్ చేయోద్దు.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అంద‌రు ఇంటి స‌భ్యులు మెడ‌లో హార్డ్ షేప్ వ‌స్తువు ఒక‌టి వేసుకోగా, నామినేష‌న్ చేసే వారు దానికి క‌త్తులు కుచ్చాల్సి ఉంది. ముందుగా అఖిల్ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టాడు. అభిజీత్ గుండెపై గుచ్చిన అఖిల్‌.. అభిజీత్ చేసిన త‌ప్పుల‌ని ఎండ‌గ‌ట్టాడు. ఇద్ద‌రి మ‌ధ్య జోరుగా చ‌ర్చ జ‌రిగింది. మేక‌ పులి అయి వ‌చ్చింద‌ని  అఖిల్ అంటే దీనికి అభిజిత్.. మేక ఎప్పుడు పులి కాదు, బ‌లైత‌ద‌ని త‌న తెలివితేట‌లు చూపించారు. నా సోచ్ గురించి మాట్లాడావు. నువ్వు వెళ్లిపోతున్నావని నేను ఆ రోజు మాట్లాడ‌లేదు. నువ్వేమైనా తురుమ్‌ఖాన్‌వా? అంటూ ఫైర్ అయ్యాడు. నువ్వు గుడ్లు బ‌య‌ట‌కు తీయ‌కు, ప‌డిపోతాయి అంటూ అఖిల్‌కు కౌంట‌ర్ ఇచ్చాడు అభిజీత్. 

మోనాల్ విష‌యం మ‌ధ్య‌లోకి తెచ్చే ప్ర‌య‌త్నం అఖిల్ చేయ‌గా, దానిని మ‌ధ్య‌లోనే క‌ట్ చేసింది మోనాల్‌. నువ్వు బ‌చ్చాగానివి.. ఛ‌ల్ ఛ‌ల్ జా అని అభిజిత్ అంటుంటే అఖిల్ దానికి కౌంట‌ర్ ఇస్తూ... నువ్వు 32 ఏళ్ళ‌కు ఇక్క‌డికి వ‌స్తే నేను 25 ఏళ్ళ‌కు వ‌చ్చాను అని అన్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య జోరుగా జ‌రిగిన డిస్క‌ష‌న్ బిగ్ బాస్ హౌజ్ వేడెక్కేలా చేసింది.logo