టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తాజా సినిమా నేనే నా (Nene Naa). నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. హార్రర్ మిస్టరీగా తెరకెక్కుతున్న నేనే నా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘రెండు రోజుల ముందు ఇక్కడికొచ్చిన ఓ విదేశీయుడు ఫారెస్ట్ లో ట్రెకింగ్ కు వెళ్లినపుడు మిస్సయ్యాడు. అక్కడ అతన్ని ఎవరో ఎటాక్ చేసినట్టనిపించింది. ఆసక్తికర విషయమేంటంటే అక్కడ అతని పాద ముద్రలు తప్ప ఇంకెవరి ముద్రలు లేవు’ అంటూ క్యూరియాసిటీని కలిగించే సంభాషణలతో సస్పెన్స్ గా సాగుతుంది ట్రైలర్.
ఈ చిత్రంలో రెజీనా ఫోరెన్సిక్ శాస్త్రవేత్తగా కనిపిస్తోంది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ నిర్మిస్తున్నారు. నేనే నా చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
రెజీనా దీంతోపాటు నివేదా థామస్ తో కలిసి ‘శాకిని ఢాకిని’ సినిమా కూడా చేస్తోంది. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో స్పెషల్ సాంగ్ లో మెరువనంది రెజీనా.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!