బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 15:55:16

ఏదో ఒకరోజు రాహుల్‌ ప్రధాని అవుతారు : దీపికా పదుకొనే

ఏదో ఒకరోజు రాహుల్‌ ప్రధాని అవుతారు : దీపికా పదుకొనే

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని ప్రశంసిస్తున్న నటి దీపికా పదుకొనే పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇందులో ఆమె రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. ఏదో ఒకరోజు రాహుల్‌ మన దేశానికి ప్రధాని అవుతారని ఈ వీడియోలో చెప్పారు. “రాహుల్ గాంధీ చేస్తున్నది ఏదైనా దేశం కోసమే.. ఆయన ఒక క్లాసిక్ ఉదాహరణ అని అనుకుంటున్నాను. ఆయన ఒక ఆశాజనక ప్రధానమంత్రి. ఏదో ఒకరోజు మన దేశ ప్రధాని అవుతారు అని ఆశిద్దాం” అని ఒక ప్రశ్నకు సమాధానంగా దీపికా పదుకొనే చెప్పారు. అంతేకాకుండా ఆయన యువతతో బాగా కనెక్ట్‌ అవుతారని నేను భావిస్తున్నాను. ఆతని ఆలోచన సాంప్రదాయంగా ఉంది. అదేసమయంలో ఆయన ఫూచరిస్టిక్‌ కూడా అని అన్నారు.

సుశాంత్‌ మరణం అనంతరం డ్రగ్స్‌ కేసులో దీపికా పదుకొనేను శనివారం ఎన్సీబీ ప్రశ్నించడంతో ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. 2017 నుంచి తన మేనేజర్ కరిష్మాతో చేసిన చాటింగ్‌లకు సంబంధించి దీపికను ఎన్సీబీ ప్రశ్నించింది. దీపికా పదుకొనేతోపాటు బాలీవుడ్‌ నటులు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా విచారణకు హాజరుకావాలంటూ ఎన్సీబీ సమన్లు ​​పంపింది. గోవాలో ఉన్న దీపికా పదుకొనే భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సెప్టెంబర్ 24 న ముంబైకి తిరిగి వచ్చి ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.logo